న్యూ ఇయర్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
కొల్లాం: కేరళలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కొల్లాం జిల్లాలో గురువారం జరిగింది. తిరువనంతపురం జిల్లాలోని ఛాత్‌నూర్ వద్ద కారు, ఎల్‌పీజీ ట్యాంకరు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
టీకెఎమ్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన మూడవ సంవత్సర విద్యార్ధులు వర్కల బీచ్ రిసార్ట్స్‌లో నూతన సంవత్సర వేడుకలు ముగించుకొని కళాశాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది.

అతి వేగంగా వచ్చిన కారు తన లారీ కిందకు చొచ్చుకుపోవడంతో... ఆ మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారిందని లారీ డ్రైవర్ మీడియాతో చెప్పారు. సమాచారం అందుకున్న కొల్లం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ కింద ఇరుక్కుపోయిన కారును వేరు చేసి, అందులో ఉన్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications