అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సై

ఐజ్వాల్‌ : ఈసారి మిజోరం లోక్‌సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడం చర్చానీయాంశమైంది. మిజోరం స్టేట్ లో ఉన్న ఒకే ఒక్క లోక్‌సభ స్థానం కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. అందులో 63 ఏళ్ల మహిళ లాల్త మౌని ఒకరు కావడం విశేషం. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

మిజోరం పార్లమెంటరీ స్థానానికి 1972లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు రెండు మూడు సార్లు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. అంతేకాదు చాలాసార్లు గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఒకరకంగా ఇక్కడ ఇండిపెండెంట్ల హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. అదే క్రమంలో ఈసారి తొలిసారిగా మహిళ పోటీ చేస్తుండటం చర్చానీయాంశంగా మారింది.

63 year old Laltha mauni Mizorams first woman candidate in lok sabha elections

ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ అయిన ఈ పార్లమెంటరీ స్థానంలో 7 లక్షల 84 వేల 339 మంది ఓటర్లున్నారు. ఇక్కడ పురుష ఓటర్లు 3 లక్షల 81 వేల 991 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 4 లక్షల 2 వేల 408 మంది ఉన్నారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 2018లో దక్షిణ ఐజ్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా ఆమె పోటీపడ్డారు. అప్పుడు 69 ఓట్లు వచ్చాయి. అయితే లాల్త మౌని ఈసారి లోక్‌సభ బరిలోకి దిగుతుండటంతో తొలిసారిగా మహిళలు పోటీచేస్తున్నట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+