దారుణం: విద్యార్థిని చితకబాదిన స్కూల్ సిబ్బంది, తీవ్ర గాయాలతో మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకొంది. ఘజియాబాద్ లో పాఠశాలలో ఏడేళ్ళ బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై భాదిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బాలుడి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను స్కూల్ ప్రిన్సిఫాల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు.

 7-year-old boy brutally beaten up in Ghaziabad school, dies

దేశ వ్యాప్తంగా పలు స్కూళ్లలో ఈ తరహ ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది సెప్టెంబర్ 8వ, తేదిన రేయాన్ స్కూల్లో ప్రద్యుమ్న ఠాకూర్ అనే విద్యార్థి మరణించిన విషయం సంచలనం సృష్టించింది.

స్కూల్ బాత్రూమ్ వద్దే ప్రద్యుమ్నను సీనియర్ విద్యార్థి హత్యచేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.గత ఏడాది ఢిల్లీలోనే మరో స్కూల్ లో పై అంతస్థు నుండి పడి విద్యార్థి మరణించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking case, a seven-year-old boy died on Thursday after being brutally beaten up in Ghaziabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X