జీఎస్టీకి ఏడేళ్లు- తగ్గనున్న వీటి రేట్లు
7 Years of GST: దేశ ఆర్థిక గతిని మార్చిన వ్యవస్థ.. వస్తు, సేవల పన్ను. నేటితో జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయింది. 2017 జులై 1వ తేదీన ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం.
అవి మినహా అన్నీ..
అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే పాత పన్నుల విధానానికి స్వస్తి పలికింది. దాని స్థానంలో జీఎస్టీని తెరమీదికి తీసుకొచ్చింది. మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు మినహా మిగిలినవన్నీ దీని పరిధిలోకి చేర్చింది. ఫలితంగా- ప్రతి నెలా కూడా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్రం రాబట్టుకుంటోంది.

రికార్డు కలెక్షన్లు..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 2.10 లక్షల కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. అత్యధికంగా జీఎస్టీ వసూళ్లను నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్‌లో నిలుస్తూ వస్తోంది ప్రతీసారీ. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉంటోన్నాయి.
అమలుకు ఏడేళ్లు..
జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయినందున కొన్ని వస్తువులపై మినహాయింపును ఇచ్చినట్లు వెల్లడించింది కేంద్ర ఆర్థిఖ మంత్రిత్వ శాఖ. గోధుమలు- 2.5, బియ్యం- 2.75, పెరుగు, లస్సి, మజ్జిగ- 4 శాతం జీఎస్టీని రద్దు చేసినట్లు తెలిపింది.
తగ్గించిన వస్తువులు..
రిస్ట్ వాచీలు, ప్లాస్టిక్‌తో తయారైన శానిటరీ వేర్, డోర్లు, కిటీకీలపై వసూలు చేస్తోన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి కుదించినట్లు వివరించింది. టూత్ పౌడర్- 17 నుంచి 12, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సబ్బులు- 27 నుంచి 18, డిటర్జెంట్, వాషింగ్ పౌడర్- 28 నుంచి 18 శాతానికి శ్లాబ్‌ను బదలాయించింది.
సినిమా టికెట్లపైనా..
ఫుట్‌వేర్‌కు చెందిన పాలిష్, క్రీమ్స్‌తో పాటు ఫర్నిచర్, ఫ్లోర్, కోచ్ వర్క్, గ్లాస్ లేదా మెటల్- 28 నుంచి 18 శాతానికి శ్లాబ్‌ను కుదించింది. 18 నుంచి 28 వరకు జీఎస్టీ శ్లాబ్ ఉన్న టేబుల్ వేర్, కిచెన్‌వేర్ 12 నుంచి 18 శాతం శ్లాబ్‌లోకి చేరాయి. ఫర్నిచర్, మ్యాట్రెసెస్- 28 నుంచి 18, 100 రూపాయల సినిమా టికెట్‌పై వసూలు చేసే 21 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది.
టీవీ, రిఫ్రేజిరేటర్లు
32 అంగుళాల టీవీ- 31.3 నుంచి 18 శాతానికి కుదించింది కేంద్రం. రిఫ్రేజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు మినహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, గీజర్లు, ఫ్యాన్‌లపై వసూలు చేస్తోన్న జీఎస్టీ మొత్తాన్ని 31.3 నుంచి 18 శాతానికి తగ్గించింది. ఎల్పీజీ స్టవ్- 21 నుంచి 18, కుట్టుమిషన్లు- 16 నుంచి 12, యూపీఎస్- 28 నుంచి 18, మొబైల్ ఫోన్లు- 31.3 నుంచి 18 శాతానికి కుదించింది.












Click it and Unblock the Notifications