75వ స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న ప్రధాని

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్నారు.

modi

ఆగస్టు 14 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే'

ఇక నుంచి ప్రతి ఏటా ఆగస్టు 14న 'పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డేగా గుర్తు చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు.

"విభజన సమయంలో ఎన్నో బాధలు పడినవారిని, ఆ సమయంలో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయిన వారిని ఆగస్టు 14న స్మరించుకుందాం" అన్నారు.

రాబోవు 25 ఏళ్లకు కొత్త లక్ష్యం

"ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్నప్పుడు భారత్ కరోనా వ్యాక్సీన్ తయారు చేసి ప్రజలకు అందించే పని చేసింది. అలా జరగకపోయుంటే భారత్‌లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం" అని ప్రధాని అన్నారు.

మహమ్మారి వ్యాపించిన సమయంలో భారత ప్రజలకు ఉచితంగా రేషన్ అందించడం ప్రపంచమంతా చర్చనీయాంశం అయ్యిందని ఆయన అన్నారు.

"మహమ్మారి సమయంలో మిగతా దేశాలతో పోలిస్తే అది భారత్‌లో తక్కువ మందికి వ్యాపించింది. మనం ఎన్నో ప్రాణాలను కాపాడగలిగాం. సంపన్న దేశాలతో పోలిస్తే మన మౌలిక సదుపాయాలు తక్కువ, జనాభా అధికం. కానీ అది మనకు ప్రశంసలు పొందే సమయం కాదు. మనం మరింత మెరుగ్గా పనిచేయాల్సిన సమయం" అని చెప్పారు.

(కథనం అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+