ముంబైలో కరోనా ఉప్పెన: 20 వేలు దాటితే లాక్ డౌన్; 8,082తాజా కేసుల్లో 90శాతం లక్షణాలు లేనివి
దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కేసులతో వణుకుతోంది. ముంబైలో తాజాగా 8086 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబై యొక్క తాజా కరోనావైరస్ కేసులలో తొంభై శాతం ఎటువంటి లక్షణాలు లేకుండా, లక్షణరహితంగా ఉన్నాయి. అధికారిక డేటా ఈ రోజు చూపిస్తుంది, గత 24 గంటల్లో 574 మంది రోగులు ఆసుపత్రిలో చేరినట్లు ఇది సూచిస్తుంది.
బెంగళూరులో కరోనా బీభత్సం.. ఏకంగా 125 కంటైన్‌మెంట్ జోన్‌లు; బొమ్మనహళ్లిలో అత్యధికం

ముంబైలో కరోనా ఉప్పెన .. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్
ఆదివారం రోజు నమోదైన 8063 కేసులతో పోలిస్తే ఈరోజు కేసుల పెరుగుదల స్వల్పంగా ఉంది కానీ ఆదివారం నాటి 10 శాతంతో పోలిస్తే ఆసుపత్రుల సంఖ్య 12 శాతానికి పెరిగింది. నగరంలో ఉప్పెన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా పెరుగుతోంది అన్న విశ్వాసం ప్రస్తుతం వ్యక్తమవుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో చేరిన 574 మంది రోగులలో 71 మంది ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారు. భయాందోళనలను తగ్గించడానికి ఆసుపత్రిలో చేరినవారు మరియు లక్షణరహిత కేసుల సమాచారాన్ని ఇప్పుడు రోజువారీ హెల్త్ బులెటిన్‌లలో చేర్చుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం తెలిపారు.

రోజువారీ 20 వేల కేసులు దాటితే లాక్ డౌన్
రోజువారీ కేసులు 20,000 దాటితే లాక్‌డౌన్ ప్రకటించబడుతుందని నగర పాలక సంస్థ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ వెల్లడించారు. పాము లాక్‌డౌన్ గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో చర్చించామని , రోజుకు 20,000 కేసుల వరకు కూడా, కావలసిన అన్ని వైద్య వసతులు కల్పిస్తున్నామని, ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన అన్నారు. గత వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి కేసుల పెరుగుదల నేపథ్యంలో వైద్య వసతుల కల్పనపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు.

మహారాష్ట్రలో మళ్ళీ భారీగా కరోనా .. 11,877 కొత్త కేసులు
ఇదిలా ఉంటే తాము రాష్ట్ర టాస్క్ ఫోర్స్‌లోని నిపుణుల ఇన్‌పుట్‌లను తీసుకుంటున్నామని, వారి అభిప్రాయం ప్రకారం ఓమిక్రాన్ ఇప్పుడు 80 శాతం (కోవిడ్ కేసులలో) ఉందని చెప్పారు . ఈ 80 శాతం కూడా రాబోయే కొద్ది రోజుల్లో 90 శాతానికి చేరుకుంటుందని , బహుశా అది రాబోయే 5-7 రోజుల్లో తాకవచ్చు అని నగరపాలక సంస్థ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. మహమ్మారి బారిన పడినప్పటి నుండి మహారాష్ట్రలో 67 లక్షల ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయని, దేశంలోనే అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది . ఇదిలా ఉంటే మహారాష్ట్రలో నిన్న 11,877 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, మునుపటి రోజు కంటే 29 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 8,063 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications