మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికి సీరియస్..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, రెండు ట్రక్కులు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. పూణేలోని నేవల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

మహారాష్ట్రలోని పూణే లోని నేవల్ బ్రిడ్జి వద్ద ఓ టక్కు అదుపుతప్పి ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొట్టింది. ఓ కారు, మరో ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో 8 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పూణే- బెంగళూరు హైవే నేవల్ బ్రిడ్జి సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.
Navale Bridge Horror: Passengers Feared Stuck As Car Caught Between Two Burning Trucks pic.twitter.com/lDPgnH39pJ
— Momentum News (@kshubhamjourno) November 13, 2025
ఈ ఘటనతో నడి రోడ్డుపై మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న మరో 6 కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో పూణే- బెంగళూరు హైవేపై గంటలపాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications