పట్టాలు తప్పిన రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు: ప్రయాణికులకు గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లక్నో వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రాంపూర్‌లోని కోసి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 8బోగీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లక్నో వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రాంపూర్‌లోని కోసి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 8బోగీలు పట్టాలు తప్పాయి.
2/8-coaches of Meerut-Lucknow #RajyaRaniExpress derailed near Rampur,No Casualties,One Injured:DRM & Medical team are at Accident Site
— Ministry of Railways (@RailMinIndia) April 15, 2017
ఈ ఘటన శనివారం ఉదయం 8గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన సమాచారమందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
#Visuals from Uttar Pradesh: Eight coaches of Meerut-Lucknow Rajya Rani Express derail near Rampur. pic.twitter.com/Lljzs16Cdq
— ANI UP (@ANINewsUP) April 15, 2017
15 మంది ప్రయాణికులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, గత మార్చిలో కూడా రైలు పట్టాలు తప్పిన ఘటనలో 40మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications