గార్డు హత్య: జైలు నుంచి పరారైనగంటల్లోనే 8మంది ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో హతం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సిమీ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. వివిధ సందర్భాల్లో పోలీసులకు పట్టుబడి భోపాల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 8మంది సిమీ ఉగ్రవాదులు.. ఆదివారం అర్ధరాత్రి జైలు కాపలాదారుడిని దారుణంగా హత్యచేసి జైలు నుంచి పరారయ్యారు. స్టీల్ గ్లాస్, ప్లేట్, దుప్పట్ల సహాయంతో జైలు గార్డును చంపేసి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగి ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు పారిపోతూ జైలు గార్డును చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ సిమి ఉగ్రవాద కార్యకర్తలు పలు దోపిడీలకు, పేలుళ్లకు పాల్పడ్డారు.

తప్పించుకున్న వారిలో మెహబూబ్, అంజాద్ ఖాన్, జకీర్ ఖాన్, మహ్మద్ షాదిక్ లతోపాటు మరో నలుగురు ఉగ్రవాదులున్నారు. వీరి ఇద్దరు కడుగుగట్టిన ఉగ్రవాదులని, పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే వీరికోసం విస్తృత గాలింపు చేపట్టారు.

8 SIMI operatives kill guard, flee from Bhopal jail

భోపాల్ జైలులో ఉగ్రవాదులు తప్పించుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది. గతంలో 10మంది సిమి ఉగ్రవాదులు ఇదే జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఐదుగురిని కొద్ది సేపట్లోనే అరెస్ట్ చేశారు. మిగితా వారు మాత్రం తప్పించుకున్నారు. తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు ఎదురుకాల్పుల్లో చనిపోగా, ఒడిశాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు.

కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 8మంది ఉగ్రవాదుల పరారీకి కారణమైన ఐదుగురు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉగ్రవాదులు బయటికి వచ్చేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భోపాల్ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు.

పరారైన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతం

భోపాల్ జైలు నుంచి పరారైన 8మంది ఉగ్రవాదులను ఉగ్రవాద వ్యతిరేక దళాలు(యాంటీ టెర్రర్ స్క్వాడ్) మట్టుబెట్టారు. గార్డును చంపేసిన ఉగ్రవాదులు జైలు నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. భోపాల్ శివారులోని ఐంతకేడి ప్రాంతంలో గుర్తించారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా.. పోలీసుల కాల్పుల్లో 8మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొదట అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఉగ్రవాదులు దాడికి దిగడంతో తప్పని పరిస్థితిలో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

జైలు నుంచి తప్పించుకుని ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో అహ్మదాబాద్‌కు చెందిన ముజీబ్ షేక్, మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ మజీద్, షోలాపూర్ కు చెందిన మహ్మద్ ఖాలీద్ అహ్మద్, మహ్మద్ సాలిక్ అలియాస్ సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు తప్పించుకున్నారని మధ్యప్రదేశ్ ఐజీ యోగేష్ చౌదరి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+