ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు..!!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కోవిడ్ స్థితిగతులపై ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న రాష్ట్రాలకు స్టాండర్ట్ ప్రొటోకాల్స్ ను జారీ చేశారు.
బుధవారం దేశవ్యాప్తంగా 1,134 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవ్వాళ కూడా ఈ సంఖ్య 1,000 వరకు ఉంటోంది. కొద్దిరోజులుగా సగటున 966 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,600కు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు పుట్టుకు రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలంటూ ప్రధాని మోదీ సైతం ఆదేశించారు.

మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు కూడా. ఈ పరిణామాలన్నింటిపైనా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పందించారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారంలో సగటున 108 రోజువారీ కేసులు నమోదు కాగా- ఇప్పుడు ఈ సంఖ్య 966కు పెరిగిందిని వివరించారు.
అత్యధికంగా కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయని చెప్పారు. కోవిడ్ కేసుల పెరుగుదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తాను ఈ నెల 16వ తేదీన ఈ ఎనిమిది రాష్ట్రాలకు వ్యక్తిగతంగా లేఖ రాసినటలు ఆయన చెప్పారు. ఇప్పుడు విజృంభిస్తోన్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా గుర్తించామని అన్నారు.

మహారాష్ట్రలో బుధవారం నాడు కొత్తగా 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు కూడా. ఈ మధ్యకాలంలో ఎప్పుడే గానీ ఒక్కరోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు. మరణాలు కూడా సంభవించలేదు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,648కి చేరింది. ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా కనిపించిన జిల్లాల్లో ఆంక్షలను విధించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications