చెట్టును ఢీకొన్న కారు: 8 మంది విద్యార్థుల మృతి
చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొనడంతో ఆ ప్రమాదం సంభవించింది.
మృతులు సేలంలోని ఎంఐటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. మృతదేహాలను కడలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదం నుంచి ఒక్క విద్యార్థి బయటపడ్డాడు. విద్యార్థులు తాగి ఉన్నారని, దానివల్లనే కారును వేగంగా నడిపించారని అనుమానిస్తున్నట్లు జిల్లా సూపరింటిండెంట్ విజయకుమార్ చెప్పారు.
కారులో పరిమితికి మించి కూర్చున్నారని కూడా చెప్పారు. ప్రమాదం సంభవించిన రోడ్డు మీద ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications