80 శాతం బాంబులు లక్ష్యాన్ని ఛేదించాయి.. ప్రభుత్వానికి శాటిలైట్ చిత్రాలు అందజేస్తామన్న ఐఏఎఫ్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ లోని బాలాకోట్ లో వైమానిక దళం చేసిన దాడులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాయుసేన దాడులు నిజమా ? అని విపక్షాలతో సహా ప్రపంచ మీడియా ప్రశ్నిస్తోంది. ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో రుజువుతో సమాధానం ఇవ్వాలని ఐఏఎఫ్ భావిస్తోంది.

శాటిలైట్ చిత్రాలు అందజేస్తాం
ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటల మొదలైన వాయుసేన దాడులు 21 నిమిషాల్లో ముగిసాయి. భారత్ దాడి తర్వాతే పాకిస్థాన్ కూడా ధీటుగా స్పందించింది. ఈ అంశాన్ని విస్మరించి .. ఆరోపణలు రావడంతో బాలాకోట్ దాడికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది. ఈ చిత్రాలే సాక్ష్యాలుగా పరిగణించాలని, ఐఏఎఫ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

అవి ఎలా ఉంటాయంటే ?
ఆ శాటిలైట్ చిత్రాలు హై రిజల్యూషన్ తో ఉంటాయని, వాటిని రాడర్ ఇమేజరీ ద్వారా ఇంటెలిజెన్స్ ఎయిర్ క్రాప్ట్ సేకరించిందని ఐఏఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో వీటిని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఐఏఎఫ్ బృందం అందజేస్తోంది.

80 శాతం లక్ష్యాల ఛేదన
బాలాకోట్ లోని ఉగ్ర వాద శిబిరంపై దాడి తర్వాత పాకిస్థాన్ దాడి జరగలేదని పేర్కొన్నది. కానీ చెట్లు, అటవీప్రాంతంలో బాంబులేసిన ఆనవాళ్లు ఉన్నాయని బుకాయిచింది. అలాగే అంతర్జాతీయ మీడియా కూడా జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడి జరిగినట్టు నిర్ధారించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు వాయుసేన ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో శాటిలైట్ చిత్రాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతోపాటు వైమానిక దళం చేసే దాడుల్లో 80 శాతం లక్ష్యాన్ని నిర్దేశిస్తాయని స్పష్టంచేశారు. 20 శాతం దాడులు మాత్రం అప్పుడప్పుడు గురితప్పుతాయని పేర్కొన్నారు. దీంతో తమ దాడులు నిజమని మరోసారి తేల్చిచెప్పారు. దీంతోపాటు శాటిలైట్ చిత్రాలతో దాడులకు సంబంధించిన ఊహాగానాలకు చెక్ పడే అవకాశం ఉంది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications