Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

80 ఏళ్ల వయసులో కామం-రూ.10వేలు ఇచ్చి అతని భార్యను పంపించాలన్నాడు-చివరికిలా హతమయ్యాడు...

80 ఏళ్ల వయసులో కామంతో రగిలిపోతూ పరాయి వ్యక్తి భార్య మీద కన్నేసిన ఓ వృద్దుడు దారుణంగా హతమయ్యాడు. డబ్బులతో ఆ వ్యక్తిని లోబర్చుకుని అతని భార్యతో శారీరక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. అదే పనిగా ఆ వృద్దుడు సదరు వ్యక్తిపై ఒత్తిడి తీసుకురావడంతో... తీవ్ర కోపోద్రిక్తుడైన అతను వృద్దుడిని హత్య చేశాడు.మహారాష్ట్రలోని నేవీ ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నేవీ ముంబైలోని ఎన్నారై కోస్టల్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పాటిల్ కథనం ప్రకారం... స్థానిక ఉల్వె ప్రాంతానికి చెందిన శమకంత్ తుకారాం నాయక్(80) చాలా సంపన్నుడు. అతనికి ఫ్లాట్స్,ప్లాట్స్,షాపులు చాలానే ఉన్నాయి. కోట్ల రూపాయల డబ్బు కూడబెట్టాడు. నాయక్ తరచూ స్థానికంగా ఉన్న ఓ షాపుకు వెళ్లి ఆ షాపు యజమాని(33)తో ముచ్చటిస్తుండేవాడు. ఇదే క్రమంలో ఓరోజు నాయక్ ఆ షాపు యజమానికి రూ.5వేలు ఇచ్చి... అతని భార్యను తన వద్దకు పంపించాలని కోరాడు. ఆ సమయంలో ఏం జరిగిందో వివరాలు వెల్లడి కాలేదు.

80 years old man killed after he offered money to a man to sleep with his wife

ఆ తర్వాత ఆగస్టు 29న మరోసారి నాయక్ ఆ షాపుకు వెళ్లాడు. ఈసారి రూ.10,000 ఇచ్చి మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించాడు. నాయక్ తీరుతో విసిగిపోయిన ఆ షాపు యజమాని అతనిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో నాయక్ కిందపడి తలకు గాయమైంది. వెంటనే షాపు షట్టర్స్ క్లోజ్ చేసిన ఆ యజమాని... నాయక్‌ను బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు.

రెండు రోజుల పాటు నాయక్ మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోనే ఉంచారు. ఆగస్టు 31,సాయంత్రం 5గంటల సమయంలో మృతదేహాన్ని ఓ బెడ్ షీట్‌లో చుట్టి బైక్‌పై తీసుకెళ్లాడు. సమీపంలోని ఓ చెరువులో ఆ మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తోంది. అతను బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

మరోవైపు నాయక్ కనిపించకుండా పోయిన రోజే అతని కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. బహుశా ఆస్తి గొడవల నేపథ్యంలో నాయక్ హత్యకు గురై ఉంటాడని పోలీసులు మొదట భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

16 ఏళ్ల బాలికను గొడ్డలితో నరికి చంపారు :

మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడుబర్ర గ్రామంలో 16 ఏళ్ల ఓ బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా హత్యకు గురైంది.గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను గొడ్డలితో నరికి చంపారు. సోమవారం(సెప్టెంబర్ 7) సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొరుగు గ్రామంలో ఉన్న స్కూల‌్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+