మోదీ మళ్లీ ప్రధాని కావాలని 102 ఏళ్ల బామ్మ పాదయాత్ర, శివరాత్రి రోజు ఆ కొండ మీద పూజలు !
మహాశివరాత్రి సందర్బంగా దేశంలోని శివుడి ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. కర్ణాటకలోని శివుడి ఆలయాల్లో ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్యక్ష్రేత్రాల్లోని ఒకటిగా చామరాజనగరలోని మలే మహదేశ్వర బెట్ట (మహదేశ్వర కొండ)కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు మలే మహదేశ్వర బెట్టకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
మహాశివరాత్రి నేపథ్యంలో హనూర్ తాలూకాలోని మలే మహదేశ్వర్ కొండపై నేటి నుంచి శివరాత్రి జాతర మహోత్సవాలు ప్రారంభం కాగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పాదయాత్ర ద్వారా వేలాది మంది భక్తులు వచ్చి మలే మహదేశ్వర కొండ మీద ఉన్న మాదప్ప దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మలే మహదేశ్వర కొండకు పాదయాత్ర చేస్తున్న వారిలో వంద సంవత్సరాలు దాటిన బామ్మ ఈ పాదయాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు.

నరేంద్ర మోదీ మళ్లీ భారత ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ 102 ఏళ్ల వృద్ధురాలు మహా శివరాత్రి రోజు నాటికి మలే మహదేశ్వర్ కొండకు ట్రెక్కింగ్ చేస్తోంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిప్పటూరుకు చెందిన పార్వతమ్మ మలే మహదేశ్వర కొండ మీద ఉన్న మాదప్పను దర్శనం చేసుకునేందుకు బయలుదేరారు. మలే మహదేశ్వర్ కొండకు కాలినడకన 18 కిలోమీటర్లు ప్రయాణించారు. పార్వతమ్మ దాదాపుగా ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహదేశ్వర్ కొండకు పాదయాత్ర చేస్తున్నారు.
102 ఏళ్ల పార్వతమ్మ మలే మహదేశ్వర కొండ మీద ఉన్న మాదప్ప దర్శనం కోసం చేతిలో కర్ర పట్టుకుని ఆ కర్ర సహాయంతో కొండలు ఎక్కుతున్నారు. ఈ వయసులో పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని పార్వతమ్మను ప్రశ్నించగా దేశానికి మేలు జరగాలి, అందుకు మోదీ మరోసారి ప్రధాని కావాలి అని అన్నారు. రైతులకు మేలు జరగాలి. వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ఇది రైతులకు మేలు చేస్తుందని, వానలు పడితే అడవి జంతువులకు మేలు జరుగుతుందని పార్వతమ్మ అన్నారు.

వానలు పడితే అడవిలోని జంతువులకు తాగునీరు అందుతుందని, ప్రజలకు తాగునీరు అందాలని ఆ దేవుడిని కోరుకుంటానని పార్వతమ్మ అన్నారు. అందుకే తన కోరికలు తీర్చాలని మలే మహదేశ్వరుని దర్శనానికి వస్తున్నాను అని పార్వతమ్మ మీడియాకు చెప్పారు. అలాగే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని తాను పాదయాత్ర చేసి మలే మహదేశ్వర కొండ మీద మాదప్పకు ప్రత్యేక పూజలు చేస్తానని పార్వతమ్మ అన్నారు.
దేశానికి మేలు జరగాలంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలని పార్వతమ్మ అన్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మరో యాత్రికుడు మీ ఆశీస్సులతో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని పార్వతమ్మతో అన్నారు. ఈ సంభాషణకు 102 ఏళ్ల పార్వతమ్మ పాదయాత్ర వీడియో, ఆమెకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాత్రి పండుగ సందర్బంగా మలే మహదేశ్వర కొండ మీద కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications