
Crime News: హారన్ కొట్టినా జరగవా.. బధిరుడిని హత్య చేసిన బాలిక..
ఆవేశం అనేది అందిరికీ ఉంటుంది. కానీ ఆ ఆవేశంలో ఒక్కోసారి ఏం చేస్తామో తెలియదు. ఇలానే ఓ బాలిక ఆవేశంలో ఒకరిని చంపింది. పదేపదే హారన్ కొట్టినా తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఆ బాలిక సైకిల్‌పై వెళ్తున్న చెవిటి వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని కంకాలిపార జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను అదుపులోకి తీసుకున్నారు.

స్కూటీకి అడ్డంగా..
ఓ బాలిక ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకుని వెళ్తోంది. వారి వాహనం ముందు సదామా లదేర్(40) అనే వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వారికి అడ్డం వచ్చాడు. దీంతో ఆమె హారన్ కొట్టింది. చెవిటివాడైన అతనికి వినబడలేదు. హారన్ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే కోపంతో బాలిక స్కూటీని ఆపింది. హారన్ కొడితే వినబడడం లేదా అని అతనిపై చాకుతో దాడి చేసింది. మెడపై పొడిచింది.

మెడపై గాయం..
దీంతో తీవ్ర రక్తస్రావమైన సదామా లదేర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. ఆ తర్వాత తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది బాలిక.మందిర్ హసౌద్ ప్రాంతంలో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆమె నుంచి నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో బాలిక..
ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య), ఆయుధాల చట్టం కింద ఆజాద్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పటేల్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్‌ను సోమవారం జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.