కేన్సర్ రోగిపై అత్యాచారం చేసిన నైబర్
కొల్లాం: కేరళలో దారుణం జరిగింది. కేన్సర్ తో బాధపడుతున్న 90 ఏళ్ల వయస్సున్న ఆమెపై అత్యాచారం చేసి పరారైనాడు. కేరళలోని కొల్లం జిల్లాలోని కడక్కల్ ప్రాంతంలో 90 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నారు.
ఇటీవల ఇంటిలో ఓంటరిగా ఉన్న ఆమె మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తి అత్యాచారం చేసి పరారైనాడు. బుధవారం బాధితురాలు ఫిర్యాదు చేశారని కొల్లాం గ్రామీణ జిల్లా ఎస్పీ అజితా బేగం తెలిపారు.

తన ఇంటి గురించి బాగా తెలిసిన వ్యక్తి తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. ఇంటి వెనుక తలుపు నుంచి వచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాల బంధువులను పిలిపించి మాట్లాడి వివరాలు సేకరించామని కొల్లాం గ్రామీణ జిల్లా ఎస్పీ అజితా బేగం అన్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, బాధితురాలికి వైద్య పరిక్షలు నిర్వహించామని ఎస్పీ అజితా బేగం తెలిపారు.












Click it and Unblock the Notifications