IITs: ఐఐటీలకు ఫ్యాకల్టీల కరువు..! పెరుగుతున్న డిమాండ్ తో ఉక్కిరిబిక్కిరి !

దేశవ్యాప్తంగా ఐఐటీ చదువులకు డిమాండ్ ఏటికేడాది పెరుగుతుంటే.. వాటిలో ఫ్యాకల్టీ మాత్రం ఏటికేడాది తగ్గిపోతోంది. ఐఐటీల్లో (IITs) చదివితే చాలని యువత రాత్రీ పగలూ చదివి జేఈఈ పరీక్షలు రాసి నానా తిప్పలు పడి సీట్లు సంపాదించుకుంటుంటే.. అక్కడికి వెళ్లాక మాత్రం వారిని ఫ్యాకల్టీ కొరత చుక్కలు చూపిస్తోందట. తాజాగా విడుదలైన ఓ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో దాదాపు 40 శాతం ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు తేలింది.

అన్ని ఐఐటీల్లో ప్రతి ఐదు అధ్యాపక పోస్టులలో రెండు ఖాళీగా ఉన్నాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కళాశాలలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ, అనేక కొత్త ప్రోగ్రామ్‌లను జోడిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత మాత్రం తప్పడం లేదు. కఠినమైన నియామక ప్రమాణాలను పాటిస్తూనే, ఖాళీలను తగ్గించడానికి నియామక ప్రక్రియను ముమ్మరం చేశామని చాలా ఐఐటీలు తెలిపాయి.

India s IITs Are Expanding Fast But 2 in 5 Faculty Seats Sit Empty

భారతదేశంలోని 23 ఐఐటీలలో మంజూరైన 12,498 అధ్యాపక పోస్టులలో, ఈ ఏడాది జనవరి 30 నాటికి 4,804 పోస్టులు, అంటే 38.4%, ఖాళీగా ఉన్నాయని హిందుస్తాన్ టైమ్స్ విశ్లేషణ వెల్లడించింది. పాట్నా (54.6%), ఖరగ్‌పూర్ (51.3%) రెండు ఐఐటీలలో సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా, మరో 12 ఐఐటీలలో మూడో వంతుకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిశోధకుల కోసం ప్రపంచ మార్కెట్లో ఉన్న పోటీ కారణంగానే ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, నాణ్యమైన పీహెచ్‌డీ పట్టభద్రుల కోసం తమ సంస్థలు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, బహుళజాతి ఆర్&డి ల్యాబ్‌లు, డీప్-టెక్ స్టార్టప్‌లతో పోటీ పడుతున్నాయని ఐఐటీ డైరెక్టర్లు పేర్కొన్నారు. ఐఐటీల అత్యంత కఠినమైన నియామక ప్రక్రియల వల్ల, తగిన అభ్యర్థులను గుర్తించే వరకు పోస్టులు తరచుగా ఖాళీగా ఉంటాయని కూడా వారు తెలిపారు.

ఈ పరిణామం భారత్ తో పాటు విదేశాలలో ఐఐటీల విస్తరణ ప్రణాళికలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, 2028-29 నాటికి 6,500 సీట్లను జోడించాలన్న కేంద్రం లక్ష్యం కింద, కోర్సులను చేర్చడానికి ఐఐటీలు రూపొందించుకున్న రోడ్ మ్యాప్‌లకు కూడా ఇది విఘాతం కలిగిస్తుంది. ప్రస్తుతం ఐఐటీలన్నింటిలో కలిపి 1,35,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే పాత , కొత్త అన్న తేడా లేకుండా క్యాంపస్‌లన్నింటిలోనూ ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు డేటా వెల్లడించింది.

India s IITs Are Expanding Fast But 2 in 5 Faculty Seats Sit Empty

తొలితరం ఐఐటీల్లో ఖరగ్‌పూర్ (51.3%), కాన్పూర్ (39%), బాంబే (38.4%), ఢిల్లీ (38.3%) అత్యధిక ఖాళీల శాతాన్ని కలిగి ఉన్నాయి. రెండోతరం ఐఐటీల్లో పాట్నా 54.6%తో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మండి (39.9%) ఉంది. ఐఐటీ (ISM) ధన్‌బాద్ (48.4%), ఐఐటీ గోవా (45.8%) ఐఐటీ గౌహతి (42.2%) వంటి మూడో సంస్థలు కూడా అధ్యాపకుల కొరత ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఐఐటీ ధార్వాడ్ అత్యల్పంగా 1.07% ఖాళీల శాతాన్ని నమోదు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ పాలక్కాడ్ (5.88%), ఐఐటీ రోపర్ (14.35%),ఐఐటీ తిరుపతి (14.38%) ఐఐటీ భిలాయ్ (15.1%)తో మెరుగ్గా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+