Peddi OTT: ఓటీటీలోకి పెద్ది.. ఎప్పుడంటే?
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన లేటెస్ట్ రూర్ల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయం అనంతరం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం
'పెద్ది' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంత చేసుకున్న 'పెద్ది'.. తాజా సమాచారం ప్రకారం జులై 2, 2026 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే హిందీ వెర్షన్ కోసం హిందీ ప్రేక్షకులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. హిందీ బాక్సాఫీస్ నిబంధనల ప్రకారం.. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన ఉండటంతో హిందీ వెర్షన్ జులై 30న అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తీసిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ నటులు శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించారు. వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలార్ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ కథను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications