వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపేందుకు చిన్నారి యత్నం(వీడియో)

|
Google Oneindia TeluguNews

పాట్నా: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు తిరిగి స్వస్థలాలకు చేరేందుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లతోపాటు బస్సులను కూడా నడుపుతున్నాయి. అయినా అనేక మంది కూలీలు రోడ్డుమార్గం గుండా నడచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతూనే ఉంది. ఇలా స్వస్థలాలకు వెళుతూ పలువురు కూలీలు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.

 కరోనా కాటు: ఆ ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన 40 మందీ క్వారంటైన్లోకి కరోనా కాటు: ఆ ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన 40 మందీ క్వారంటైన్లోకి

హృదయ విదారకం

హృదయ విదారకం

తాజాగా, బీహార్ రాష్ట్రంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి బీహార్‌కు శ్రామిక్ ప్రత్యేక రైలులో వెళుతున్న ఓ మహిళా వలస కూలీ మార్గమధ్యలోనే ఆహారం లేక నీరసించి పడిపోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ విషయం తెలియని ఆమె చిన్నారి కొడుకు ఆమెను లేపేందుకు ప్రయత్నించడం అందర్నీకలిచివేసింది.

నీరు, ఆహారం కూడా లేవు..

నీరు, ఆహారం కూడా లేవు..

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆహారం, తాగు నీరు లభించకపోవడంతో ఆ మహిళ బాగా నీరసించిపోయిందని ఆమె బంధువులు తెలిపారు. శనివారం గుజరాత్‌లో ఆమె రైలు ఎక్కారు. సోమవారం ముజఫర్పూర్ చేరుకున్న తర్వాత రైలు దిగిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

మహిళ మృతదేహం వద్ద చిన్నారి..


స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఉన్న సదరు మహిళ మృతదేహం వద్ద ఉన్న ఆమె చిన్నారి కొడుకు ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. అమ్మ పడుకుందేమోనని ఆమెపై ఉన్న బట్టతో కాసేపు అటూ ఇటూ లాగి ఆడుకున్నాడు. ఆ తర్వాత అక్కడేవున్న మరో బాలుడు వచ్చి అతడ్ని పట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన పట్ల నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల ప్రాణాలు కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ఆకలిదప్పుల్లో వలస జీవులు..

ఆకలిదప్పుల్లో వలస జీవులు..

కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన వలస కూలీలకు సరిపోవడం లేదు. దీంతో అనేక మంది సొంత వాహనాలు, సైకిళ్లు, నడుచుకుంటూనే తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. కొందరు మార్గమధ్యలోనే తీవ్రమైన ఎండలకు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆకలి దప్పులతో పలువురు మరణిస్తున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

English summary
A child plays with a shroud covering its dead mother at a station in Bihar, in one of the most tragic visuals to emerge from the countless stories of migrants stranded by the coronavirus lockdown, desperate for jobs, food or shelter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X