Aishwarya Rai: అడ్మిట్ కార్డుపై ఐశ్వర్య రాయ్ ఫొటో.. కంగుతిన్న విద్యార్థిని..

సాధారణంగా ఓటర్ లిస్ట్ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకరి ఫొటోకు బదులుగా మరొకరి ఫొటోలు వస్తుంటాయి. కానీ అడ్మిట్ కార్డలలో కూడా ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటోలు వస్తున్నాయి. ఝార్ఖండ్ ధన్ బాద్ లోని బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ చేసిన పనికి ఓ పీజీ విద్యార్థినికి ఆశ్చర్యపోయింది. BBMKUలో PG సెమిస్టర్-2 పరీక్ష ఉన్న నేపథ్యంలో అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ కోసం వెళ్లిన కాజల్ కుమారి అనే విద్యార్థిని... తన అడ్మిట్ కార్డులో ఉన్న ఫొటో చూసి షాకయింది.

అన్ని ఒకే కానీ..
అందులో అప్లికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి.. కానీ ఫొటో దగ్గరికి వచ్చేసరికి మాత్రం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఫొటో ఉంది. ఇది గమనించిన కాజల్ ఈ విషయాన్ని యూనివర్సిటీ సిబ్బందికి తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు సాంకేతిక లోపంగానే ఇలా జరిగినట్టుగా తెలిపారు. దీనిపై విచారణ చేస్తామని.. విద్యార్థినికి పరీక్షకు ఎలాంటి అడ్డంకు రాకుండా చూసుకుంటామని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు.

A BBMKU student got Aishwarya Rais photo instead of her photo in the admit card

అది యూనివర్సిటీ పని కాదు
ఫారం నింపేవరకే తమ పని అని, అడ్మిట్ కార్డుపై ఫొటోలు, సంతకాలు అప్ లోడ్ చేయడం విశ్వవిద్యాలయం చేయదన్నారు. ఇది యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర అన్న అధికారులు... విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడ్మిట్ కార్డ్‌పై ఫోటోలు సంతకాలను అప్‌లోడ్ చేయడం విశ్వవిద్యాలయం చేయదని BBMKU పరీక్ష కంట్రోలర్ SK బరన్వాల్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+