నాకు, నా ఫ్యామిలీకి నా భార్య చేతబడి చేయించింది. ప్రముఖ వ్యాపారి లబోదిబో !
బెంగళూరు: చేతబడి, మంత్రాలు చేస్తూ తన కుటుంబానికి భయం పుట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యాపారవేత్త అతని భార్యపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు నగరంలోని రెస్ట్‌హౌస్ రోడ్డుకు చెందిన వ్యాపారి దేవ్‌కుమార్ అలియాస్ దేవ్ (39) ఫిర్యాదు మేరకు వ్యాపారి భార్య ఎంపీ ఐశ్వర్య అలియాస్ ఐశ్వర్య, అత్తగారు మహాలక్ష్మి, బావ మంజునాథ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారు వ్యాపారవేత్త దేవ్ కుమార్ జూన్ 1, 2022న ఎంపీ ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ, 2023లో దేవ్ కుమార్ వ్యాపార పర్యటన ముగించుకుని బెంగళూరులోని ఇంటికి తిరిగి వచ్చాడు. తరువాత బాత్రూంలో బూడిద, కర్పూరం చెల్లాచెదురుగా కనిపించడంతో వ్యాపారవేత్త దేవ్ కుమార్ హడలిపోయాడు. అలాగే భార్య ఐశ్వర్య రెండు బొటనవేళ్లు కోసి రక్తం కారుతున్నట్లు గుర్తించారు.

ఇంట్లో చాలా చోట్ల నిమ్మకాయలు, పూజించిన కొబ్బరికాయలు కనిపించాయని దేవ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. దీనిపై తనకు అనుమానం రావడంతో దేవ్ కుమార్ అతని భార్య ఐశ్వర్య కదలికలపై ఓ ప్రైవేట్ దర్యాప్తు సంస్థ ద్వారా నిఘా వేయించాడు. తన భార్య ఐశ్వర్య పూర్తి సమాచాం తనకు తెలియజేయాలని వ్యాపారి దేవ్ కుమార్ ఆ సంస్థకు సూచించాను.
ఈ ప్రైవేట్ దర్యాప్తు సంస్థ నివేదికలో వ్యాపారి దేవ్ కుమార్ భార్య ఐశ్వర్య, అత్తగారు మహాలక్ష్మిలు అత్తిగుప్పేకు చెందిన జ్యోతిష్యుడు నాగేంద్రను, శ్మశాన వాటికలో పూజలు చేసిన బాబును కలిశారని తెలిసింది. ఈ దెబ్బతో వ్యాపారవేత్త దేవ్ కుమార్ హడలిపోయాడు. అర్దరాత్రి తన భార్య ఐశ్వర్య, ఆమె కుటుంబ సభ్యులు స్మశానంలోకి వెళ్లి ఎందుకు పూజలు చేశారు ? అని దేవ్ కుమార్ ఆలోచించాడు.
జూన్ 22వ తేదీ 2023లో నా భార్య ఐశ్వర్య తన ఇంటి నుండి తిరిగి మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి వంట మనిషి చేసిన ఆహారం మీద నూనె, బూడిద, ఉమ్మి వేసి నాకు మరియు నా కుటుంబానికి వడ్డించారని వ్యాపారి దేవ్ కుమార్ అంటున్నారు. దీంతో ప్రాణభయంతో నా భార్య ఐశ్వర్యను జూన్ 5వ తేదీన ఆమె పుట్టింటికి పంపించాను. ఇంతలో మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టారని వ్యాపారి దేవ్ కుమార్ ఆరోపించారు.

తనను, తన కుటుంబ సభ్యులను నాశనం చేసిన తరువాత మా ఆస్తులు స్వాధీనం చేసుకోవాని తన భార్య ఐశ్వర్య, ఆమె కుటుంబ సభ్యులు స్కెచ్ వేశారని వ్యాపారవేత్త దేవ్ కుమార్ ఆరోపిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి దేవ్ కుమార్ ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కబ్బన్ పార్క్ పోలీసు అధికారులు తెలిపారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications