కేజ్రీ 4కోట్ల ఆరోపణ, వీడియో: ఎంపీకి ఢిల్లీ బీజేపీ షోకాజ్

ఢిల్లీ: తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో... బీజేపీ ఢిల్లీ అధ్యక్షులు సతీష్ ఉపాధ్యాయ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నేత షేర్ సింగ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కాగా, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందంకు అవసరమయ్యే సంఖ్యా బలం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మేల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్సిస్తోందని కేజ్రీవాల్ సోమవారం ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను సోమవారం ఆయన విడుదల చేశారు.

A BJP Government in Delhi Or Polls? Centre May Tell SC

ఈ టేపులు నిజమని తేలితే బిజెపిపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టులో కూడా ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. బిజెపి ఎంపి షేర్‌సింగ్ దగర్ తమ పార్టీకి చెందిన దినేష్ మోహనియాకు 4 కోట్ల లంచం ఇవ్వజూపారంటూ ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని యు ట్యూబ్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో షేర్‌సింగ్‌కు ఢిల్లీ అధ్యక్షులు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

కాగా, ఏఏపీ ఆరోపణల పైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అదృశ్యం కాకుండా ఉండటం కోసం ఏఏపీ ఈ తరహా ఆరోపణలకు దిగుతోందని విమర్శించారు. ఆరోపణల పైన షేర్‌సింగ్ కూడా స్పందించారు. తన పైన ఆరోపణలు రుజువైతే రాజకీయాలు వదిలేస్తానని, 44 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, వీటిని వదిలేస్తానని సవాల్ చేశారు.

మరోవైపు, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా లేక ఎన్నికలకు సిద్ధమా అనే విషయమై కేంద్రం మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+