మీద నీళ్ళు పొయ్యొద్దు అన్నాడని .. 16 ఏళ్ళ యువకుడిని కత్తితో పొడిచిన బాలుడు

హోలీ పండుగ రానే లేదు. కానీ ఆకతాయిగా హోలీ ఆడి, వద్దని వారించిన యువకుడిపై ఒక బాలుడు దాడి చేశాడు. హోలీ వస్తున్న సందర్భంగా ముందునుండి అందరి మీద నీళ్లు పోసి ఆట పట్టిస్తున్న ఓ 12 ఏళ్ల బాలుడు, మీద నీళ్లు పొయ్యొద్దని కోపగించుకున్నందుకు ఏకంగా కత్తితో దాడి చేశాడు. ఛాతీపై, కడుపులో పలుమార్లు పొడిచాడు. దేశమంతా రంగులతో నిండిపోయే హోలీ పండుగ రావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే చోటు చేసుకున్న ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

A boy stabbed a teenager with knife

నీళ్ళు పొయ్యొద్దు అన్నందుకు 16ఏళ్ల టీనేజర్‌ను కత్తితో పొడిచిన 12ఏళ్ల బాలుడు

మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణం బాలల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని తేటతెల్లం చేస్తుంది. ఓ 12ఏళ్ల పిల్లోడు.. 16ఏళ్ల టీనేజర్‌ను కత్తితో పొడిచిన సంఘటన హనుమాన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే హోళీ పండగ వారం రోజులు ఉండగానే.. ఆ ప్రాంతంలో సందడి మొదలైపోయింది. ఆటో డ్రైవర్ కొడుకైన ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లోడు రంగులకు బదులు వాటర్ బెలూన్‌ను విసిరి అక్కడ ఉన్నవాళ్లని ఆటపట్టిస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే తెలిసిన యజమాని దగ్గర 16ఏళ్ల టీనేజర్ పని చేస్తున్నాడు. వాటర్ బెలూన్ తీసుకుని వచ్చి నీళ్లు పోసి ఆట పట్టిస్తున్న ఆ పిల్లోడ్ని రావొద్దంటూ వారించాడు. వస్తే ఊరుకోనని హెచ్చరించాడు.

కత్తితో పలుమార్లు దాడి.. ఆస్పత్రిలో బాధితుడు, జువైనల్ హోం లో బాలుడు

అంతే ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి చాతీపై, కడుపులో పలుమార్లు పొడిచాడు. స్థానికులు నిందితుడ్ని అదుపుచేసి బాధితుడ్ని సెంట్రల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత కేఈఎమ్ హాస్పిటల్ కు బదిలీ చేశారు. ఇక ఈ సంఘటన చూసిన వారు ఆ పిల్లవాడిని వాటర్ బెలూన్ విసరొద్దని.. మాట వినకపోతే పోలీసులకు చెప్తానని వారించాడు. అంతే ఆవేశంలో ఇంట్లో నుంచి కత్తి తీసుకుని వచ్చి ఘోరానికి పాల్పడ్డాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడ్ని పోలీసులు భీవండీ జువైనల్ హోమ్‌ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+