ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, పరీక్షల్లో ఏం చేసిందంటే ?, ఐదవ అంతస్తు మీదకు వెళ్లి ?

బెంగళూరు: ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కాలేజ్ అమ్మాయి ఆత్మహత్యతో కాలేజ్ లోని సాటి విద్యార్థులు అందరూ హడలిపోయారు. మాన్య (19) ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఈ విద్యార్థి కర్ణాటలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయపట్నం తాలూకాలోని దండిగనహళ్లి హోబ్లిలోని హొన్నశెట్టిహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నదని పోలీసులు అన్నారు.

హాసన్ నగర శివార్లలోని రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మాన్య మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుతున్నదని పోలీసులు తెలిపారు. హాసన్‌ శివార్లలోని రాజీవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్నల్‌ పరీక్షలు జరుగుతున్నాయని కాలేజ్ యాజమాన్యం పోలీసులకు చెప్పింది.

A college girl committed suicide by jumping from the fifth floor of an engineering college in Hassan
కాలేజ్ లో ఇంటర్నల్ పరీక్షలు రాస్తున్న మాన్య పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో పరీక్ష హాల్ లో ఉన్న లెక్చరర్ మాన్య కాపీ కొడుతున్న విషయం గమనించి ఆమెను పరీక్షా కేంద్రంలో నుంచి బయటకు పంపించాడు. తరువాత ఆ లెక్చరర్ మాన్య పరీక్షల్లో కాపీ కొడుతోందని కాలేజ్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించాడు.

కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ మాన్యను ఆయన రూమ్ లోకి పిలిపించాడు. తరువాత పరీక్షల్లో ఇంకముందు కాపీ కొట్టను అని క్షమాపణ పత్రం రాసివ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్ మాన్యకు చెప్పాడు. ఇదే విషయం కాలేజ్ లెక్చరర్లు కూడా మాన్యకు చెప్పారు. తనకు అందరిముందు అవమానం జరిగిందని మాన్య ఆవేదన చెందిందని తెలిసింది.

కాలేజ్ అమ్మాయి మాన్య ముందుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి తరువాత బయటకు వచ్చింది. తరువాత కళాశాలలోని ఐదో అంతస్తు మీదకు వెళ్లిన మాన్య అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివచాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+