సోషల్ మీడియాలో ఫోటోలను మార్ఫ్ చేసి , 100 మంది మహిళలకు షాక్ .. ఓ సైబర్ క్రిమినల్ కథ
ఓ బ్యాంకు మేనేజర్ ను ఆమె నకిలీ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని బెదిరించి, ఆమె వద్ద నుండి డబ్బులు వసూలు చేసిన ఓ సైబర్ క్రిమినల్ ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఇండస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న బాధితురాలు ఢిల్లీ లోని మాల్వియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాడి పట్టుకున్న పోలీసులు అతగాడు చేసిన నేరాల చిట్టా ని చూసి షాక్ తిన్నారు.

మహిళల ఫోటోలను అసభ్య రీతిలో మార్ఫ్ చేసి .. 100 మంది మహిళల బ్లాక్ మెయిల్
ఇది ఒక క్రిమినల్ కథ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ మోసకారి కథ. సోషల్ మీడియాలో మహిళలు పెట్టిన ఫోటోలను తీసి, ఆ ఫోటోలను మార్ఫ్ చేసి ,అశ్లీల చిత్రాలుగా తయారుచేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నోయిడాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ ఝా అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను దాదాపు వందమంది మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు వెల్లడించారు.

సోషల్ మీడియా అకౌంట్ల నుండి ఫోటోలు డౌన్ లోడ్ .. ఆపై మార్ఫ్ చేసి డబ్బుల కోసం వేధింపులు
సోషల్ మీడియాలో మహిళలు అకౌంట్ల నుండి ఫోటోలు డౌన్లోడ్ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటిల్లో సదరు మహిళలకు సంబంధించిన అశ్లీల మార్ఫ్ చేసిన ఫోటోలు పెడతానని సదరు కేటుగాడు బెదిరింపులకు పాల్పడేవాడిని పోలీసులు వెల్లడించారు. మార్ఫ్ చేసిన ఫోటోలను మహిళలకు పంపి , అడిగినంత డబ్బు ఇవ్వాలని వేధించేవాడని పేర్కొన్నారు.
ఇండస్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మాల్వియా నగర్ నివాసి అయిన మహిళ, తన చిత్రాన్ని హ్యాక్ చేసిన తర్వాత దానిని మార్ఫ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి నిందితుడు తనను వేధించి, దోపిడీ చేశాడని ఆరోపించారు.

ఇండస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడిన కేతుగాడి కథ
ఇండస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు . నిందితుడు పోలీసులకు దొరక్కుండా ఉండడం కోసం వాట్సప్ ద్వారా వివోఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడేవాడిని పోలీసులు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా ఇదే నేరం కింద ఛత్తీస్ గడ్ , నోయిడాలో రెండుసార్లు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఏ మాత్రం మార్పు లేకుండా మళ్ళీ ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడని వారు వెల్లడించారు .

బాధితుల జాబితా చూసి షాక్ అయిన పోలీసులు
సైబర్ నేరగాడు మోడస్ ఒపెరాండిలో మహిళల సోషల్ మీడియా ఖాతాల నుండి ప్రొఫైల్ చిత్రాలను సేవ్ చేసి, ఆపై వాటిని మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించి మహిళలకు బెదిరింపు సందేశాలను పంపాడని, మహిళలు రుజువు అడిగినప్పుడు, నిందితుడు వారి మార్ఫింగ్ చిత్రాన్ని పంపారని పేర్కొన్నారు. చిత్రాలను తొలగించకుండా మహిళల నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడని వెల్లడించారు.
ఇతని బాధితుల జాబితా చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అందుకే మహిళలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు .
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications