ఆకలిని గెలిచిన అక్షరం, కోట్లాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం

తెల్లవారుజామున నిద్రలేచి, పుస్తకాల సంచీ భుజాన వేసుకుని బడికి వెళ్లే ప్రతి బిడ్డ కళ్లలో ఒక కల ఉంటుంది. కానీ, ఆ కడుపులో ఆకలి మంట ఉంటే.. ఆ కళ్లు అక్షరాలను ఎలా చదవగలవు? "ఏ బిడ్డ కూడా ఆకలి కడుపుతో బడికి వెళ్లకూడదు" అనే ఒకే ఒక్క సంకల్పం, నేడు దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది చిన్నారుల జీవితాల్లో పోషకాహార విప్లవాన్ని సృష్టించింది. అదే శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ అందిస్తున్న 'సాయి శ్యూర్' (SaiSure) విజయగాథ.

"ఏ బిడ్డ కూడా ఆకలి కడుపుతో బడికి వెళ్లకూడదు. ఒక బిడ్డ ఆకలి తీర్చడం అంటే, ఆ దేశపు భవిష్యత్తును ఆరోగ్యవంతంగా నిర్మించడమే. అన్నం, ఆరోగ్యం మరియు విద్య అనేవి ప్రతి బిడ్డ జన్మహక్కులు. వాటిని అందరికీ ఉచితంగా, సమానంగా అందించడమే మానవత్వానికి మనం చేసే నిజమైన సేవ" అని నమ్ముతారు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి. ఆయన ఆశయాలకు సాకార రూపమే చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దేనహళ్లిలోని శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్. పదేళ్ల క్రితం ఒక చిన్న సంకల్పంతో మొదలైన ఈ సేవ, నేడు లక్షలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ 'దశమానోత్సవ' వేడుకలను జరుపుకుంటోంది.

A Decade of SaiSure Empowering 1 Crore Rural Students with Nutrition and Education Across India

ఈ మహోద్యమం వెనుక..

ఈ మహోద్యమం వెనుక ఒక హృదయాన్ని కలిచివేసే సంఘటన దాగి ఉంది. 2012 ఏప్రిల్ నెలలో బెంగళూరు సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా, కొందరు పిల్లలు ఆకలితో స్పృహతప్పి పడిపోయారు. ఆ పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే బడికి వచ్చారని తెలుసుకున్న సద్గురు, వారి కోసం అల్పాహార సేవను ప్రారంభించాలని నిర్ణయించారు. కేవలం 50 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది విద్యార్థులకు చేరువయ్యే స్థాయికి ఎదిగింది. ఇది కేవలం ఒక అల్పాహార పథకం మాత్రమే కాదు, దేశంలోని పోషకాహార లోపాన్ని పారద్రోలే ఒక గొప్ప సామాజిక చైతన్యంగా రూపుదిద్దుకుంది.

హెల్త్ మిశ్రమాన్ని..

లక్షలాది మందికి వండిన ఆహారాన్ని అందించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి, శాస్త్రీయంగా రూపొందించిన 'సాయి శ్యూర్' (SaiSure) అనే హెల్త్ మిశ్రమాన్ని ట్రస్ట్ పరిచయం చేసింది. ముద్దేనహళ్లిలో FSSAI ప్రమాణాల ప్రకారం తయారయ్యే ఈ పొడిలో విటమిన్ D, B-కాంప్లెక్స్, విటమిన్ C మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణ భారతావనిలో రాగి ఆధారితంగా, ఉత్తర భారతావనిలో గోధుమ ఆధారితంగా దీనిని అందిస్తున్నారు. పాలతో కలిపి తీసుకునే ఈ పౌష్టికాహారం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, వారిలో ఏకాగ్రత మరియు చదువుపై ఆసక్తి పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కేవలం విద్యార్థులకే కాకుండా..

ఈ పథకం కేవలం విద్యార్థులకే కాకుండా, దేశానికి వెన్నెముకైన రైతులకు కూడా అండగా నిలుస్తోంది. కర్ణాటకలోని తిప్తూరు ప్రాంతానికి చెందిన సుమారు 3,000 మంది రైతుల నుండి నేరుగా రాగులను సేకరించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా ఈ విజయానికి ప్రధాన కారణం. పుదుచ్చేరిలో మొదలైన ఈ ప్రస్థానం నేడు తెలంగాణ, కర్ణాటక, అస్సాం వంటి 25 రాష్ట్రాలకు విస్తరించింది. కర్ణాటక ప్రభుత్వం తన 'క్షీర భాగ్య' పథకంతో దీనిని జోడించగా, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ సేవ ఒక స్ఫూర్తిగా నిలిచింది.

గత దశాబ్ద కాలంలో కోట్లాది మంది బిడ్డల కడుపు నింపిన ఈ అన్నపూర్ణ ట్రస్ట్, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న మిగిలిన 7 కోట్ల మంది చిన్నారులకు కూడా 'సాయి శ్యూర్' అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కేవలం ఆహారం పంపిణీ చేయడం మాత్రమే కాదు, ఒక దృఢమైన దేశాన్ని నిర్మించే దిశగా వేసిన బలమైన అడుగు. సమాజం, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే ఎంతటి సామాజిక మార్పునైనా సాధించవచ్చని ఈ పదేళ్ల ప్రయాణం నిరూపించింది.

మరింత సమాచారం కోసం: annapoorna.org.in ఈ సైట్ ను విజిట్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+