లవర్స్ ఎస్కేప్: వెంటాడి పట్టుకున్న ఫ్యామిలీ, తక్కువ జాతి అని చంపేశారు, ప్రియుడు!
మైసూరు: మూడు నెలలుగా అదృశ్యం అయిన తన ప్రియురాలు కనిపించలేదని ప్రియుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు దర్యాప్తు చెయ్యడంతో దారుణమై నిజాలు వెలుగు చూశాయి. మనకంటే తక్కువ కులం వాడిని ప్రేమించావా అంటూ తల్లిదండ్రులు యువతిని దారుణంగా చంపేశారు.
కుమార్తె కనిపించడం లేదని తరువాత వారే గ్రామస్తులకు చెప్పారు. ప్రేమించిన వ్యక్తితో తమ కుమార్తె వెళ్లిపోయిందని గ్రామస్తులను నమ్మించారు. అయితే ఆమె ప్రియుడు పోలీసులను ఆశ్రయించి తన ప్రియురాలు కనిపించడం లేదని ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి.

ప్రేమించుకున్నారు
మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకా పార్వతీపురంలో నివాసం ఉంటున్న శోభ (19), కృష్ణ (25) అనే యువకుడిని ప్రేమించింది. రెండేళ్లుగా ప్రేమించిన శోభను వివాహం చేసుకోవాలని కృష్ణ నిర్ణయించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి నిర్ణయించారు.

తక్కువ జాతి అనే కారణంతో
శోభ, కృష్ణ కులాలు వేరు. శోభ కంటే కృష్ణ తక్కువ కులానికి చెందినవాడు. ఈ విషయంపై శోభ తల్లిదండ్రులు గురుసిద్దేగౌడ, మహదేవమ్మ పెళ్లికి అభ్యంతరం చెప్పారు. శోభ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు.

రహస్యంగా ప్రియుడితో !
శోభ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సందర్బంలో, బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తన ప్రియుడు కృష్ణను రహస్యంగా కలుసుకుంటున్నది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మూడు నెలల క్రితం ఆమెను చితకబాదేశారు. తరువాత శోభను ఇంటి నుంచి బయటకు పంపించలేదు.

ప్రియుడితో ఎస్కేప్
మూడు నెలల క్రితం శోభ, కృష్ణ ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న తండ్రి గురుసిద్దేగౌడ తన భార్య, బంధువులతో కలిసి శోభ, కృష్ణను వెంబడించారు. సినిమా ఫక్కిలో ఇద్దరి మీద దాడి చేశారు. ఆ సందర్బంలో వారి దాడి నుంచి కృష్ణ తప్పించుకుని పారిపోయాడు.

కూతరు అనే జాలి లేకుండా చంపేశారు
శోభను పట్టుకున్న ఆమె తండ్రి గురుసిద్దేగౌడ, తల్లి మహదేవమ్మ, వీరి బంధువులు కిరణ్, మహేష్, రామేగౌడ దారుణంగా ఆమెను కొట్టి చంపేశారు. తరువాత ఆమె శవాన్ని పూడ్చిపెట్టేశారు. ప్రేమించిన ప్రియుడితో తమ కుమార్తె లేచిపోయిందని గ్రామస్తులను నమ్మించారు.

స్నేహితుల సహాయంతో
25 ఏళ్ల కృష్ణ తన ప్రియరాలు శోభ వస్తోందని ఇంత కాలం ఎదురు చూశాడు. అయితే మూడు నెలలు అయినా శోభ కనపడకపోవడం, కనీసం ఫోన్ చెయ్యకపోవడంతో ఆరా తీశాడు. తల్లిదండ్రుల ఇంటిలో కూడా శోభ లేదని స్నేహితుల సహాయంతో తెలుసుకున్నాడు.

నా ప్రియురాలు కనిపించలేదు
తన ప్రియురాలు శోభ కనపడటం లేదని ఆమె ప్రియుడు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీశారు. శోభా కుటుంబ సభ్యులను విచారించగా మాకు ఏమీ తెలీదు అంటూ నాటకం ఆడారు. పోలీసులు బెండ్ తీయ్యడంతో శోభను చంపేశాం అంటూ అసలు విషయం చెప్పారు. శోభ తల్లిదండ్రులు గురుసిద్దేగౌడ, మహదేవమ్మ, వారి బంధువులు కిరణ్, మహేష్, రామేగౌడను అరెస్టు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications