నాటుకోడి పులుసు కోసం రగడ, కొడుకును కొట్టి చంపేసిన తండ్రి, కోడి ఓనర్ ఎవరు ?
బెంగళూరు/మంగళూరు: కన్న కొడుకులు, కూతుర్లను కన్నతండ్రి ఎంతో ప్రేమగా పెంచి పోషిస్తారో కొత్తగా చెప్పనవసరం లేదు. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చెయ్యాలని ప్రయత్నించిన తండ్రిని కన్న కొడుకులు ఏమాత్రం చూసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము.అయితే నాటుకోడి చికెన్ కోసం కన్న తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురి కావడం కలకలం రేపింది.
నాటుకోడి చికెన్ పులుసు కోసం ఆవేశంతో ఊగిపోయిన తండ్రి అతని కొడుకును కొట్టి చంపేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలుకాలోని గుత్తిగారు గ్రామంలో శీన అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శీనకు శివరామ (32) అనే కుమారుడు ఉన్నాడు. ఇంటి దగ్గర శీన నాటుకోళ్లు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు నాటుకోడి కోసం పులుసు పెట్టుకుని తింటుంటారు.
శీన కుమారుడు శివరామ్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వెళ్లిన శివరామ్ ఇంటి దగ్గర ఉన్న నాటుకోడి కోసి కూర చెయ్యడానికి ప్రయత్నించాడు. ఈ రోజు కోడికొయ్యకూడదని, రేపు కోడికోసి కూరచేసి పెడుతానని శివరామ్ కు అతని తల్లిదండ్రులు బుద్దిమాటలు చెప్పారు.

చెప్పినట్లుగానే మరుసటిరోజు నాటుకోడి కోసి కూర చేశారు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన శివరామ్ నాటుకోడి పులుసు కూర మొత్తం తినేశాడు. ఒక్కముక్క కూడా లేకుండా నాటుకోడి తినేసిన శివరామ్ తీరికగా కుర్చుని టీవీ చూస్తున్నాడు. మంచి ఆకలితో ఇంటికి వెళ్లిన శీన అన్నం పెట్టుకుని కూర వేసుకుందామని చూస్తే నాటుకోడి కూరు ఒక్క ముక్కకూడా లేకపోవడంతో షాక్ అయ్యాడు.
హీరో కోసం పోటాపోటీ, సీఎంకు ప్రచారం చేస్తే నేను వదిలేస్తానా ?, చాలెంజ్, రప్పిస్తా !
ఎందుకు నాటుకోడి మొత్తం తినేశావు, ఇప్పుడు మేము ఏం తినాలి అని శీనా అతని కొడుకు శివరామ్ ను ప్రశ్నించాడు. కోళ్లకు గింజలు వేసి నువ్వు పెంచావు, నేను పెంచాను, నాటుకోళ్లకు నువ్వు ఓనర్ అవుతావు, నేను ఓనర్ అవుతాను ? అంతే అంటూ శివరామ్ అతని తండ్రితో లాజిక్ లో మాట్లాడటం మొదలుపెట్టాడు. తండ్రీ కొడుకుల మద్య మాటామాటా పెరిగిపోయింది.
మద్యం మత్తులో ఉన్న శివరామ్ అతని తండ్రిని ఎదురించి దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. కోపంలో ఉన్న శీన చెనిగిపార తీసుకుని కొడుకు శివరామ్ తల మీద దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలైన శివరామ్ ప్రాణాలు పోయాయి. నాటుకోడి కూర కోసం గొడవ జరిగి తండ్రి శీన చేతిలో అతని కొడుకు శివరామ్ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications