హీరో కోసం పోటాపోటీ, సీఎంకు ప్రచారం చేస్తే నేను వదిలేస్తానా ?, చాలెంజ్, రప్పిస్తా !
బెంగళూరు/తుమకూరు: కన్నడ స్టార్ హీరో, బహుబాష నటుడు. దర్శకుడు కిచ్చా సుదీప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు బీజేపీ నాయకుల తరపున ప్రచారం చెయ్యడం దాదాపుగా ఖరారు అయ్యింది. సీఎంతో పాటు వాల్మీకి కులానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున సుదీప్ ప్రచారం చేస్తారని తెలిసింది.
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన హీరో సుదీప్ తో ఆ వర్గం ఓటర్లు ఉన్న పలు నియోజక వర్గాల్లో ప్రచారం చేయించి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. హీరో సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చెయ్యడం ఆయన వ్యక్తిగత విషయం అని మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్,డీ. కుమారస్వామి ఇప్పటికే మీడియాకు చెప్పారు.

అయితే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మధుగిరి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు కేఎన్. రాజన్న బాంబు పేల్చారు. గురువారం తుమకూరులో మీడియాతో మాట్లాడిన రాజన్న తనను మధుగిరిలో గెలిపించడానికి హీరో సుదీప్ ఇక్కడ ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి హీరో సుదీప్ ఎలా ప్రచారం చేస్తారో అలాగే తన కోసం మధుగిరి వచ్చి మా హీరో ప్రచారం చేస్తారని రాజన్న అన్నారు. సుదీప్ ఎవ్వరికి ప్రచారం చేసినా తాను పట్టించుకోనని, తన కోసం ప్రచారం చెయ్యాలని ఆయన్ను కచ్చితంగా ఇక్కడికి పిలుచుకుని వస్తానని కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజన్న ధీమా వ్యక్తం చేశారు.
మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ రెండు రెండు నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడం వారి వ్యక్తిగత వ్యవహారం అని, వారి రాజకీయ అనుభవంతో అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని, ఈ విషయంలో తాను ఎక్కువ మాట్లాడనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధుగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజన్న అన్నారు. మొత్తం మీద హీరో సుదీప్ తో ప్రచారం చేయించుకుని ఎమ్మెల్యేలు అయిపోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications