కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి చంపేసిన తండ్రి, బతికిపోయిన భార్య రేఖా !
సూరత్/గుజరాత్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్య, పిల్లల తీరుతో ఇంటి పెద్ద విసిగిపోతున్నాడని తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, సహనం కోల్పోయిన వ్యక్తి చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డున పడింది.
కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన సొంత కూతురిని కత్తితో 25 సార్లు పొడిచి చంపిన దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. నిందితుడు రామానుజు సాహు అలియాస్ రామానుజ తన నలుగురు పిల్లలు మరియు భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్‌గా మారింది.

సూరత్‌లోని కడోదరలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తెను హత్య చేసిన భర్త రామానుజపై అతని భార్య రేఖా ఫిర్యాదు చేసింది. పోలీసులు రామానుజులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
తండ్రి కత్తిపోటు నుంచి తప్పించుకునేందుకు కూతురు ప్రయత్నించినా వెంటాడి చంపేసిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.
గాయపడిన ముగ్గురు కుమారులు, భార్య రేఖకు చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. రాత్రి కూతురు టెర్రాస్ మీద పడుకుంటానని తల్లి రేఖాకు చెప్పింది. ఆ సమయంలో నువ్వు టెర్రాస్ మీదకు వెళ్లకూడదని రామానుజ అతని కూతురుకు చెప్పాడు. ఆ సమయంలో భార్య రేఖా కూతురిని టెర్రాస్ మీదకు వెళ్లి నిద్రపోవాలని చెప్పిందని తెలిసింది.
ఆ సమయంలో రామానుజ, రేఖా దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగిందని, ఇంత గొడవ జరగడానికి నువ్వే కారణం అంటూ రెచ్చిపోయిన రామానుజ కత్తి తీసుకుని అతని కూతురిని 25 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడని పోలీసులు అన్నారు. కుటుంబ కలహాలకారణంగా కన్నకూతురిని తండ్రి అతి కిరాతకంగా హత్య చెయ్యడం సూరత్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications