నా ఆస్తుల లిస్ట్ తో ప్రతిపక్షం గేమ్స్, మా లీడర్ నే వదల్లేదు, నేను ఎంత ? !
బెంగళూరు/న్యూఢిల్లీ: నా ఆస్తులు ఎన్నికోట్ల రూపాయాలు, వాటి వివరాలు ఏమిటి, కేసుల వివరాలు ఏమిటి ? అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సుమారు 5 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇది బీజేపీ నాయకుల కుట్రలో భాగంగా జరిగిందని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు నగర శివార్లలోని కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి డీకే. శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదే కనకపుర అసెంబ్లీ ఎన్నికల్లో డీకే. శివకుమార్ తమ్ముడు డీకే. సురేష్ కూడా పోటీ చెయ్యడానికి గురువారం నామినేషన్ వేశారు. కనకపురలో తన తమ్ముడు డీకే. సురేష్ పోటీ చెయ్యడం వెనుక చాలా పెద్ద కథ ఉందని డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం బెంగళూరులో డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. డీకే. సురేష్ తో నామినేషన్ వేయించాలని తాను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని, చాలా ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని, దాని వెనుక ఉన్న అసలు స్టోరీ తాను ఇప్పుడే బయటకు చెప్పనని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అన్నారు.
రాజకీయాలు చెయ్యడం మీకే కాదు, తనకు బాగా తెలుసని బీజేపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా డీకే శివకుమార్ మండిపడ్డారు. తన తమ్ముడు డీకే. సురేష్ కనకపురలో ఎందుకు పోటీ చేస్తున్నాడు ? అనే విషయం త్వరలోనే ప్రజలకు వివరిస్తానని డీకే. శివకుమార్ అన్నారు. ద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులకు త్వరలోనే కన్నడ ప్రజలు సరైన బుద్ది చెబుతారని డీకే. శికుమార్ అన్నారు.
బీజేపీ నాయకులు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, రాహుల్ గాంధీనే బీజేపీ వదల్లేదని, ఇక తనను వదిలిపెడుతారా ? అని డీకే. శివకుమార్ అన్నారు. తన మీద ఎన్ని కేసులు పెట్టినా, తనను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా బీజేపీ నాయకులకు మాత్రం తాను లొంగనని, కనకపుర అసలు మ్యాటర్ ప్రజలకు బహిరంగంగా వివరించే సమయం దగ్గరలోనే ఉందని, ఆరోజు కోసం చాలా మంది వేచి చూస్తున్నారని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications