రాజధానిలో నాలుగేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇంటి పక్కన ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకుని వెళ్లిన కామాంధులు గ్యాంగ్ రేప్ చేసి రైల్వే ట్రాక్ సమీపంలో విసిరేసి వెళ్లారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నది.
ఢిల్లీ నగరంలోని సఫదర్ జంగ్ ఆసుపత్రిలో బాలిక చావుబ్రతుకుల మద్య పోరాడుతున్నదని పోలీసు అధికారులు చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీ నగరంలోని కేశవపురం మురికివాడలో శుక్రవారం సాయంత్రం నాలుగు సంవత్సరాల బాలిక ఆడుకుంటున్నది.
Visited 4 night shelter for women n family at Nizamudin n Jama Mazjid. Met such strong women. Sleeping in 1 night shelter. Good Night Delhi
— Swati Maliwal (@SwatiJaiHind) October 10, 2015 ఆ సందర్బంలో బాలికను ఎత్తుకెళ్లిన కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. శనివారం బాలికను తీసుకువెళ్లి రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్జనప్రదేశంలో విసిరివేసి వెళ్లారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఆసుపత్రి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఢిల్లీ నగరంలో ఇలాంటి దారుణ సంఘటనలు అరికట్టలేమా అంటూ సోషల్ మీడియాలో ఆమె విచారం వ్యక్తం చేశారు.

బాలిక నివాసం ఉంటున్న ప్రాంతంలో వైన్ షాప్ ఉందని, అక్కడికి వచ్చిన తాగుబోతులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications