అక్రమ సంబంధం, భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించి భర్త ఆత్మహత్య, పరాయి స్త్రీ కోసం!
బెంగళూరు: అక్రమ సంబంధం విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటి హత్య చేసిన భర్త అతను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కారణంతో అతి దారుణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ముగ్గురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారైనాయి.

హ్యాపిగా సంసారం
కర్ణాటకలోని చిత్రదుర్గలోని గారపట్టి లేఔట్ లో అరుణ్ కుమార్ (43), లతా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. అరుణ్ కుమార్, లతాకు 16 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అరుణ్ కుమార్, లతా దంపతుల కుమార్తె అమృత (14). అరుణ్ కుమార్ ప్రైవేట్ బస్సుల (ట్రావెల్స్) ఏజెంట్ గా పని చేస్తున్నాడు. లతా ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది.

అక్రమ సంబంధం
అరుణ్ కుమార్, లతా దంపతులు కుమార్తె అమృతను చూసుకుంటూ చాల సంతోషంగా గడిపేవారు. అయితే కొంత కాలం నుంచి అరుణ్ కుమార్ వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలిసింది. తన విషయం భార్య లతాకు తెలీదని చాల కాలం అరుణ్ కుమార్ భ్రమలో ఉండేవాడు.

రోజూ రచ్చ రచ్చ
అరుణ్ కుమార్ వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం అతని భార్య లతాకు తెలిసిందిపోయింది. భర్త అరుణ్ కుమార్ అక్రమ సంబంధం విషయంలో అతని భార్య లతా నిలదీసింది. ఇదే విషయంలో అరుణ్ కుమార్, లతా దంపతుల మధ్య రోజూ గొడవలతో ఇంటిలో రచ్చ రచ్చ అయ్యేది.

పంచాయితీలు చేసినా!
అరుణ్ కుమార్, లతా దంపతుల గొడవ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాలా సార్లు పంచాయితీలు చేశారు. నిత్యం మీరు ఇలాగే గొడవలు పడుతుంటే మీ కుమార్తె అమృత చదువు మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని పెద్దలు హెచ్చరించారు. అయినా అరుణ్ కుమార్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిసింది.

భార్య, కుమార్తెకు నిప్పంటించి!
భర్త అరుణ్ కుమార్ అక్రమ సంబంధం విషయంలోనే ఇంటిలో లతా పెద్ద గొడవ చేసింది. ఆ సమయంలో ఇంటి లోపల తలుపుకు గడియ పెట్టిన అరుణ్ కుమార్, లతా, కుమార్తె అమృత పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అరుణ్ కుమార్ భార్య, కుమార్తెకు నిప్పంటి హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని లతా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కోటే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications