సీనియర్ డాక్టర్ టార్చర్ తట్టుకోలేక క్వారిలో దూకి లేడీ డాక్టర్ ఆత్మహత్య !
బెంగళూరు/బళ్లారి: బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) చదివేందుకు బళ్లారి నుంచి వచ్చి చిన్నపిల్లల డాక్టర్ కావాలనే ఆశతో ఎండీ చదువుకుంటున్న విద్యార్థిని కోలార్‌లోని చెరువులో శవమై కనిపించింది. కాలేజీలో వేధింపులు, తండ్రిని పోగొట్టుకోవడంతో మనస్థాపానికి గురైన యువతి స్నేహితుడికి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.
బెంగళూరు రూరల్ జిల్లా హోస్ కోటేలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్న విద్యార్థిని దర్శిని కోలార్ తాలూకాలోని కెందట్టి గ్రామంలో క్వారీలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని బళ్లారికి చెందిన దర్శినిగా గుర్తించామని పోలీసులు అంటున్నారు. హోస్ కోటే లోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ ఎండీ చేస్తున్న దర్శిని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఆదివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కాలేజీ వదిలి నేరుగా కోలార్ తాలూకా కెందట్టి సమీపంలోని క్వారి దగ్గరకు వెళ్లింది. చెప్పులు, మొబైల్ ఫోన్ తీసి క్వారీ బయటపెట్టింది. అదే సమయంలో తన స్నేహితుడు మణికి ఫోన్ చేసిన దర్శిని తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతున్నానని చెప్పంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని దర్శిని ఆమె స్నేహితుడు మణికి చెప్పింది.
అ సందర్భంలో మణి స్నేహితురాలు దర్శిని తల్లితో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ దర్శిని కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. మళ్లీ ఎంత ప్రయత్నించినా దర్శిని కాల్ రిసీవ్ చేసుకోలేదు. అప్పటికే దర్శిని క్వారీలోని నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో ప్రతిభ కనబరిచిన దర్శిని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉచితంగా ఎండీ సీటు సాధించింది. అదనంగా, ఆమె పెద పిల్లల కోసం స్పెషలిస్ట్‌గా పనిచేయాలని ఆశపడింది.
బళ్లారిలో తాను స్వంత నర్సింగ్‌హోమ్ తెరవాలని కలలు కనిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. తండ్రిని కోల్పోయిన దర్శిని తల్లి ఆశ్రయంలో పెరిగింది. తల్లి టీచర్‌గా పనిచేస్తూ కూతుర్ని డాక్టర్‌ని చేయాలనే కోరిక మేరకు చదివిస్తోంది. దర్శిని 7 నెలల క్రితమే ఎంవీజే మెడికల్ కాలేజీలో చేర్పించారు. వైద్య కళాశాలలో విశ్రాంతి లేకుండా 48 గంటల పాటు కంటిన్యూగా పనిచేయాల్సి వచ్చిందని, మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం లేదని దర్శిని ఇప్పటికే ఆమె స్నేహితులకు చెప్పిందని తెలిసింది.

సీనియర్ డాక్టర్ అయిన మహేష్ తనను వేధిస్తున్నాడని, కాఫీ తాగుదాం రండి, రాత్రికి ఫోన్ చెయ్యండి అంటూ దర్శినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇన్ని వేధింపులు జరిగినా పాలకవర్గం వేధింపులపై ప్రశ్నిస్తే ఇంటర్నల్ మార్కులు రావనే భయంతో వేధింపుల విషయం గురించి కుటుంబసభ్యులకు చెప్పలేదని, స్నేహితుడు మణికి దర్శిని ఆమె బాధను చెప్పుకుందని తెలిసింది. ఎంవీజే కళాశాల పాలకమండలి, సీనియర్ డాక్టర్ మహేష్ మీద దర్శిని తల్లి కేసు పెట్టడంతో విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications