కోటీశ్వరుడి కూతురు అమెరికాలో ఎంఎస్ చదివింది, బెంగళూరులో ఉద్యోగం, భర్త ఫ్యామిలీ దెబ్బకు !
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుళ్యా తాలూకాకు చెందిన 26 ఏళ్ల గృహిణి బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. భర్త కుటుంబీకుల వేధింపులతో విసిగిపోయిన వివాభిత మహిళ బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకునే ముందు కోటీశ్వరుల ఫ్యామిలీకి చెందిన ఆమె భర్త, అత్తమామలు, బంధువుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసింది.
ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు ఐశ్వర్య. ఆమె భర్త రాజేష్ ప్రముఖ వ్యాపారవేత్త, సుళ్యా తాలూకాలోని కనకమజలు కపిలలో రాజేష్ నివాసం ఉంటున్నాడు. రాజేష్ ఐస్ క్రీమ్ వ్యాపారం చేసే గిరియప్ప గౌడ్ కుమారుడు. ఐశ్వర్య అదే సూళ్యా తాలూకాలోని ఉబరడ్క మిట్టూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్య గౌడ, ఉషా దంపతుల కుమార్తె. 5 సంవత్సరాల క్రితం అను డైరీ రిచ్ ఐస్ క్రీమ్ కంపెనీ (సీతా ఐస్ క్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్) యజమాని కుమారుడు అయిన రాజేష్‌తో ఐశ్వర్ వివాహం చేశారు.

ఐశ్వర్య బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. రాజేష్ సొంతంగా ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరూ బెంగళూరులో ఉండేవారు. ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా బెంగళూరులో స్థిరపడ్డారు. ఐశ్వర్య కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐశ్వర్య ఆమె రాజేష్ కు ఫోన్ చేసి మాట్లాడిందని తెలిసింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐశ్వర్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న గోవిందరాజనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య భర్త రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదు మందిని అరెస్టు చేశామని, మిగిలిన వాళ్ల కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
కోటీశ్వరుడి కుమార్తె అయిన ఐశ్వర్య అమెరికాలో ఎంఎస్ చదివింది. బెంగళూరు చేరుకున్న తరువాత ఐశ్వర్య మంచి ఉద్యోగం చేస్తోంది. కోట్లలో ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తున్న రాజేష్ ను వివాహం చేసుకున్న తరువాత ఐశ్వర్య ఉద్యోగం చేస్తోంది. అయితే ఐశ్వరకు మేనత్త భర్త రవీంద్ర. దగ్గర బంధువు అయిన రవీంద్ర కుటుంబ సభ్యుల కారణంగా ఐశ్వర్య ఫ్యామిలీలో గొడవలు మొదలైనాయి.

ఐశ్వర్య తండ్రి సుబ్రమణ్య గౌడకు, రవీంద్రల మధ్య ఆస్తి తగాదాలు రావడవంతో అక్కడ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. ఐశ్వర్య అమెరికాలో చెడుతిరుగుడు తిరిగిందని, ఆమె క్యారెక్టర్ సరిగా లేదని రవీంద్ర అతని మేనకోడలు ఐశ్వర్య మీద లేనిపోని అపద్దాలు రాజేష్ కుటుంబ సభ్యులకు చెప్పారు.
ఐశ్వర్య మేనమామ రాజేష్ ఐస్ క్రీమ్ కంపెనీలో ఆడిటర్ గా పని చేస్తుండటం, పెళ్లికూడా ఆయనే సెట్ చెయ్యడంతో ఆయన చెప్పమాటలు నిజమే అని ఐశ్వర్య రాజేష్ తో పాటు అతని కుటుం సభ్యులు నమ్మారు. అప్పటి నుంచి రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐశ్వర్యను చిత్రహింసలకు గురి చెయ్యడంతో ఐశ్వర్య ఇంతకాలం ఓపికగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు అన్నారు.
భర్తతో పాటు అత్తమామలు, మరిది, తోడుకోడలు తదితరులు నిత్యం టార్చర్ పెట్టడంతో విసిగిపోయిన ఐశ్వర్య వారం రోజుల క్రితం బెంగళూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో డెత్ నోట్ రాసిన ఐశ్వర్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె భర్త రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు గోవా వెళ్లి మూడు రోజులు పార్టీ చేసుకున్నారని, అక్కడి నుంచి ముంబాయి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications