ఆకలి తీర్చాడని చనిపోయాక మృతదేహానికి ముద్దుపెట్టి అంత్యక్రియలకు వెళ్లిన వానరం.. వైరల్ వీడియో ఇదిగో!

మానవ సంబంధాలు రోజురోజుకీ మృగ్యం అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా వ్యాపార సంబంధాలలాగా మానవ సంబంధాలు మారుతున్నాయి. కుటుంబ బంధాలు కూడా అవసరాలకే అన్నట్టుగా మారిపోయాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితులు మారుతున్న నేటి కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు ఒక్కోసారి సమాజంలోని ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి.

జార్ఖండ్ లో షాకింగ్ ఘటన
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు ఉన్న నేటి రోజుల్లో, ఆకలి తీర్చిన వ్యక్తిని మరిచిపోని ఓ వానరం ఆ వ్యక్తి చనిపోతే అతనిపై చూపించిన ప్రేమ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తాలూకా వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

A monkey kissed deceased person and went funeral viral video

అన్నం పెట్టిన వ్యక్తి చనిపోతే మృతదేహం వద్దకు వచ్చిన వానరం
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రంలోని డియోడర్ లో జరిగిన ఘటన తాలూకా వివరాలలో మృతుడు మున్నా సింగ్ జంతువుల పట్ల ప్రేమను చూపించేవాడు. అతను తరచూ కోతులకు, కొండముచ్చు లకు ఆహారం పెట్టేవాడు. అతను చనిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు అతని అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ప్రతిరోజు అతను ఆహారం పెట్టే ఒక వానరం మున్నాసింగ్ మృతదేహం వద్దకు వచ్చింది.

మృతదేహానికి ముద్దు పెట్టి, అంత్యక్రియలకు వెళ్ళిన వానరం
మృతదేహంపై కప్పి ఉన్న గుడ్డను పక్కకు తొలగించి మృతదేహాన్ని చూసి గంటలు తరబడి అక్కడే కూర్చుంది. మృతదేహానికి ముద్దు పెట్టుకుంది. ఆపై వానరం మృతదేహంతో పాటు అంత్యక్రియలకు స్మశానం వరకు వెళ్ళింది. స్మశానం లోను మున్నా సింగ్ ను తగలబెట్టడానికి పేర్చిన చితిపైన కాసేపు మున్నా సింగ్ ని చూస్తూ కాసేపు దిగాలుగా కూర్చుంది. ఇక ఈ దృశ్యాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

మూగజీవి ప్రేమకు అంతా షాక్
ఆ నోరు లేని మూగ జీవానికి ఉన్న ప్రేమకు వారంతా షాక్ కు గురయ్యారు. మనుషులకే మనుషుల పట్ల జాలి లేనటువంటి ప్రస్తుత సమాజంలో ఒక జంతువు మనిషి పట్ల చూపిస్తున్న ప్రేమ వారిలో ఆలోచన రేకెత్తించింది. వారిలో సునిశితమైన భావాలను తట్టి లేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+