Viral Video: కుమారుడి కాలేజీ ఫీజు కోసం తల్లి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న పేదింటి కథ..!

తల్లిదండ్రులు పిల్లలే ప్రాణంగా బతుకుతారు. తాము కష్టపడ్డా.. పిల్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఇలానే ఓ తల్లి తన బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంది. భర్త లేకున్నా కష్టపడుతూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. అయితే కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోవడంతో ఆ తల్లీ ఓ నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పడంతో కుమారుడి కాలేజీ ఫీజు కోసం ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదరకమైన ఘటన తమిళనాడులు జరిగింది. ఈ ఘటన గురించి తెలిసిన వారు.. ఆ తల్లీ పనికి ఆశ్చర్యపోతున్నారు. కొడుకు కాలేజీ ఫీజు ప్రాణాలు తీసుకున్న అమ్మకు ఘన నివాళి అర్పిస్తున్నారు.

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన పాపతికి కుమార్తె, కొడుకు ఉన్నారు. భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోవడంతో పిల్లలను అన్నీ తానై పోషిస్తోంది. ఆమె స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. తన జీవతం కార్మికురాలి ముగిసినా.. తన కుమార్తె, కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలని ఆమె కలలుకంది. ఆ దిశగా ఎంత కష్టమైనా.. పిల్లలను చదివించుకుంటూ వస్తోంది. కూతరు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతుండగా.. కొడుకు పాలిటెక్నిక్ చదువుతోన్నాడు.

suicide

అయితో కుమారుడి కాలేజీ ఫీజ్ అవసరమైంది. అయిత తన వద్ద డబ్బు లేకపోవడంతో పాపతి పలువురి వద్దకు వెళ్లి అప్పు అడిగింది. అయితే ఎవరూ ఆమె అప్పు ఇవ్వలేదు. దీంతో తన కుమారుడి కాలేజీ ఫీజ్ ఎలా కట్టాలని ఆలోచిస్తున్న పాపతికి ఎవరో.. "నువ్వు పారిశుద్ధ్య కార్మికురాలి కాబట్టి నువ్వు మరణిస్తే డబ్బు వస్తుంది. అంతేకాదు మీ పిల్లలను ప్రభుత్వం చదివిస్తుంది"ఆమె చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన పాపతి.. తన ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో పాపతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం అనుకోకుండా జరగలేదని పోలీసులు విచారణలో తేలింది. అక్కడే దుకాణంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా.. పాపతి కావాలనే బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా.. ఆమె కుమారుడి కాలేజీ ఫీజు కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను కుమారుడు ఖండించాడు. తన ఫీజు బంధువులు చెల్లించారని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+