వీడి టార్గెట్ హిందూ అమ్మాయిలు, నలుగురికి వల, ఐదు మంది భార్యలు !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన మైనారిటీ యువకుడు ఇప్పటికే ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశాడు. 19 ఏళ్ల హిందూ యువతితో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడు అంతకుముందే ఆమెతో మతం మార్పించాడని వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన రషీద్ అనే వ్యక్తికి ఐదుగురు భార్యలు ఉన్నారు. ఆ ఐదు మంది భార్యల్లో ఒకరు ముస్లిం కాగా, మిగతా నలుగురు భార్యలు హిందువులు కావడం గమనార్హం. 4 రోజుల క్రితం 19 ఏళ్ల యువతి తన తల్లి బంధువుల ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే రషీద్ అసలు బండారం వెలుగులోకి వచ్చింది. యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు రషీద్ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ మరో కుమార్తెను కూడా తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత స్వామి యశ్వీర్ సింగ్‌తో సహా స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలతో పాటు హిందూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. లవ్ జీహాద్ వ్యవహారంతో సంబంధం ఉన్న రషీద్ తో పాటు మిగిలిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇన్ని బెదిరింపులు వచ్చినా యువతి నిందితుడి వద్దే ఉంది. జూన్ 22లోపు యువతిని తన ఇంటికి తీసుకురావాలి. లేనిపక్షంలో గ్రామంలో నిరసన తెలుపుతామని స్థానిక కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌లో మెమోరాండం సమర్పించారు. మహిళను 24 గంటల్లో ఇంటికి పిలిపించాలి. లేనిపక్షంలో జూన్ 22న షామ్లీలోని అదమాపురా గ్రామంలో హిందూ సంస్థల మహాసభలు నిర్వహిస్తామని బఘరా ఆశ్రమ ప్రచారకర్త యశ్వీర్ సింగ్ హెచ్చరించారు. యశ్వీర్ సింగ్ కూడా అదమాపుర నివాసి కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాబ్రీ పోలీస్ స్టేషన్‌లో యశ్వీర్ సింగ్ మరియు బజరంగ్ దళ్ సభ్యులు ఈ విషయంలో రచ్చ సృష్టించారు. హిందూ సంస్థలు ఈ ఘటనను లవ్ జిహాద్ కు రషీద్ అనే ముస్లిం వ్యక్తి స్కెచ్ లు వేస్తున్నాడని, ఓ మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. రషీద్ పచ్చి మోసగాడని, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు.

అంతేకాకుండా నిందితుడు రషీద్కు ఐదుగురు భార్యలు ఉన్నారని, అతని ఐదుగురు భార్యలలో ఒకరు ముస్లిం అని, మిగిలిన నలుగురు భార్యలు హిందువులని భజరంగ్ కార్యకర్తలు ఆరోపించారు. నిందితుడు రషీద్‌పై చప్రౌలి పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిందితుడు రషీద్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications