Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !
చెన్నై/వేలూరు: యువతి ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకుంటున్నది. యువతి వయసు 18 ఏళ్లు. 10 రోజుల క్రితం యువతికి ఆమె మేనమామతో వివాహం అయ్యింది. 10 రోజుల తరువాత యువతి మళ్లీ ఉద్యోగానికి చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం వరకు యువతి కోసం గాలించిన కుటుంబ సభ్యులు కూతురు కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న యువతి మరో యువకుడిని మళ్లీ పెళ్లి చేసుకుందని వెలుగుచూడటంతో హడలిపోయారు. పోలీసుల విచారణలో సినిమా ట్విస్టులను మించి పేరు లవ్ స్టోరీ బయటకు వచ్చింది.

మేనమామతో పెళ్లి
తమిళనాడులోని వేలూరు జిల్లా పల్లికొండ పక్కనే ఉన్న ఒడియాత్తూరులోని పుదుమనైకి చెందిన 18 ఏళ్ల యువతి అదే ప్రాంతంలోని ఓ జ్యూస్ దుకాణంలో పనిచేస్తోంది. ప్రతిరోజు ఆయువతి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. 10 రోజుల క్రితం ఆ యువతికి, ఆమె మేనమామతో వివాహమైందని. కుటుంబ సభ్యుల సమక్షంలో మేనమామను పెళ్లి చేసుకున్న యువతి ఆమె భర్తతో హ్యాపీగా కాపురం చేసింది.

కొత్త పెళ్లి కూతురు జంప్ జిలాని
పెళ్లి చేసుకున్న 10 రోజుల తరువాత ఆ యువతి జ్యూస్ దుకాణంలో పని చెయ్యడానికి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పల్లికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాయం అయిన యువతి తరచూ గోకుల్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నది పోలీసులు గుర్తించారు. ఒడియటూరుకు చెందిన గోకుల్ కు 26 ఏళ్లు. పల్లికొండ పెట్రోల్ బంకులో గోకుల్ పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

పిల్లల తండ్రితో లవ్
గోకుల్ కు ఇప్పటికే పెళ్లయిందని, అతనికి రెండేళ్ల కొడుకు ఉన్నాడని, ఇప్పుడు అతని భార్య 6 నెలల గర్భిణి అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కొత్త పెళ్లికూతురితో పాటు గోకుల్ కూడా మాయం అయ్యాడని గుర్తించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న గోకుల్ కు రెండు సంవత్సరాల ఏళ్ల క్రితం జ్యూస్ షాప్ లో పని చేస్తున్న అమ్మాయి పరిచయం అయ్యిందని పోలీసులకు తెలిసింది. పోలీసులు గోకుల్ భార్య కలిసి ఆమె నుంచి వివరాలు సేకరించారు.

కంత్రి మొగుడు
స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్న గోకుల్ అతని భార్యకు మాత్రం మ్యాటర్ తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రియురాలికి కూడా తనకు పెళ్లి అయిన విషయం దాచిపెట్టిన గోకుల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. ప్రేమికుడు గోకుల్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న యువతికి పెట్రోల్ బంకు పక్కనే ఉన్న జ్యూస్ షాపులో ఉద్యోగం రావడంతో ఇద్దరూ ఇంకా ఎక్కువ కలవడం మొదలుపెట్టారు.

పెళ్లి చేసుకుని ప్రియుడితో కొత్త పెళ్లికూతురు జంప్
ఇటీవల గోకుల్ కు పెళ్లి అయ్యిందని తెలుసుకున్న ప్రియురాలు అతనితో గొడవపడింది. ఇదే సమయంలో జ్యూస్ షాప్ లో పని చేస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇంట్లో చూపించిన మేనమామను ఆ యువతి పెళ్లి చేసుకుంది. ప్రియురాలికి పెళ్లి అయిన విషయం తెలుసుకున్న గోకుల్ షాక్ అయ్యాడు. వెంటనే ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రేమికులు సిద్ధమయ్యారు. గర్భవతి అయిన భార్యను, రెండేళ్ల చిన్నారిని గోకుల్ వదిలేశాడు. కొత్త పెళ్లికూతురు భర్తను వదిలేసి ఇద్దరూ పారిపోయారు.

ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసిన కొత్త పెళ్లికూతురు
గోకుల్ కు కొత్త పపెళ్లికూతురు టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. గుడిలో తనకు తాళి కట్టాలని కొత్త పెళ్లికూతురు చెప్పింది. ఇది విన్న గోకుల్ షాక్ అయ్యి నా భార్యకు విడాకులు తీసుకోకుండా తాళి ఎలా కట్టాలా అని గోకుల్ అతని ప్రియురాలిని ప్రశ్నించాడు. ఇప్పుడు నాకు తాళి కట్టకపోతే నేను జరిగిన విషయం మొత్తం లెటర్ రాస్తానని, అందులో నా చావుకి నువ్వే కారణం నువ్వే అని రాసిపెట్టి విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటానని కొత్త పెళ్లికూతురు గోకుల్ ను బెదిరించింది.

రెండు వారాల్లో ఇద్దరిని పెళ్లి చేసుకుంది
దీంతో భయపడిన గోకుల్ 25వ తేదీన గుడియాతంలోని ఓ ఆలయంలో కొత్త పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు. అద్దెకు ఇల్లు తీసుకుని ఇద్దరూ కాపురం పెట్టారు. యువతి ఉన్న ఇంటిని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని పట్టుకున్నారు. తాలి విప్పి తల్లిదండ్రులతో వెళ్లాలని పోలీసులు యువతికి సూచించారు. నేను తాలీ ఎలా తీయగలను, నేను గర్భవతిని గోకుల్ ను పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లికూతురు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

మస్త్ డ్రామాలు ఆడిన కొత్త పెళ్లికూతురు
మ్యాటర్ తెలుసుకున్న గోకుల్ భార్య ఆమె బిడ్డను తీసుకుని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఆమె బిడ్డను కొత్త పెళ్లికూతురి పాదాల దగ్గర పెళ్లి నా భర్త గోకుల్ ను నాకు ఇప్పగించండి, నేను 6 నెలల గర్భవతిని అని వేడుకుంది. కొత్త పెళ్లికూతురు కూడా నేను గర్బవతి అని ఎదురు తిరిగింది. పోలీసులు కొత్త పెళ్లికూతురికి వైద్యపరీక్షలు చేయించారు. అయితే ఆమె గర్బవతి కాదని వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు బుద్దిమాటలు చెప్పి కొత్త పెళ్లికూతురికి కొన్నిగంటలు బ్రైన్ వాష్ చేసి ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 10 రోజులకే వేరేవాడితో లేచిపోయిన నా భార్యతో నేను కాపురం చెయ్యలేను అని ఆమె మేనమామ తేల్చి చెప్పడంతో కథ మళ్లీ అడ్డం తిరిగింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications