Crime News: ఉరివేసుకోవడం ఎలా అని నటిస్తూ విద్యార్థి మృతి
ఈ మధ్య సోషల్ మీడియా పిచ్చి పెరిగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలా మంది సోషల్ మీడియా సెలబ్రెటి కావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ఒక్కొసారి వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని నటించపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

దారం బిగుసుకుని
తమిళనాడులోని చెన్నై పుళల్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థి శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించాలని చూశాడు. కానీ గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు విడిచాడు. బుద్దాగరం గ్రామం కామరజర్ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు కార్తీక్ స్థానికంగా ఉండే ప్రభుత్వం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.

నైలాన్ తాడు
అయితే అతను ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇద్దరు సోదరులకు గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తీక్ నటించి చూపించాలని, దాన్ని వీడియో తీయాలని సోదరులకు చెప్పాడు. అతను కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కికి నైలాన్ తాడు తగిలించాడు.

కుర్చీ పడిపోయింది
మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకుని నటిస్తున్నాడు. అయితే కుర్చీ అకస్మాత్తుగా కింద పడి పోవడంతో కార్తీక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుంది. దీంతో అతను ఉపిరి ఆడక చనిపోయాడు. అతని సోదరులు అతన్ని రక్షించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు.












Click it and Unblock the Notifications