చనిపోతున్నానంటూ టెక్కీ సెల్పీ, ఇలా..

చనిపోతున్నానంటూ ఓ టెక్కీ సెల్పీ తీసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటుచేసుకొంది. మృతుడిని అభిషేక్ గా గుర్తించారు.

పూణె:టిసిఎస్ లో పనిచేస్తోన్న 23 ఏళ్ళ టెక్కీ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొనేముందు ఆయన సెల్పీ తీసుకొన్నాడు. ఈ సెల్పీని ఆయన తన స్నేహితుడికి పంపాడు.చనిపోయిన టెక్కీని అభిషేక్ కుమార్ గా గుర్తించారు.

మహరాష్ట్రలో మరో టెక్కీ చనిపోయాడు. గత ఆదివారం నాడు కంపెనీలోనే ఓ మహిళ టెక్కీ హత్యకు గురికాగా, గురువారం నాడు అభిషేక్ అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాంగ్రియా మెగాపాలిస్ సోసైటిలో ఆయన అద్దెకు ఉంటున్నాడు. చనిపోయే ముందు దుప్పటిని మెడకు చుట్టుకొని సెల్పీ తీసుకొన్నాడు. దీన్ని తన స్నేహితుడికి పంపాడు. తర్వాత ప్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులు తెలిపారు.

a techie clicks selfie, hangs self in i.t. Park home

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు చెందిన అభిషేక్ తొమ్మిది నెలల క్రితం టిసిఎస్ లో ఉద్యోగంలో చేరాడు. స్నేమితులతో కలిసి త్రీబెడ్ రూమ్ ఫ్లాట్ లో అద్దెకు ఉండేవాడు. ఒక్కో గదిలో ఇద్దరు చొప్పున ఉండేవారు. అభిషేక్ తన రూమ్ మేట్ బయటకు వెళ్ళిన సమయంలో ఆత్మహత్య చేసుకొన్నాడు.

అభిషేక్ ఎవరికైతే తాను చనిపోతున్నంటూ సెల్పీ మేసేజ్ ను పంపాడో....అతను అభిషేక్ రూమ్ మేట్స్ కు సమాచార్ని చేరవేశాడు. వారు తలుపులు బద్దలు కొట్టి చూస్తే అభిషేక్ ప్యాన్ కు వెళాడుతూ కన్పించాడు.

అతణ్ని ఆసుపత్రికి తరలిస్తే మరణించినట్టుగా వైద్యులు చెప్పారని పోలీసులు చెప్పారు.అభిషేక్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+