Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతి జాతకంలో దోషం ఉందని కారులోనే జల్సా చేసిన పూజారి, కట్ చేస్తే !

జాతక దోషం సమస్యలు సరిచేస్తానని నమ్మించిన పూజారి తనకు తెలిసిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై హాసన్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం పూజారిని బెంగళూరులోని బాగల్‌గుంటే పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటకలోని హాసన్‌లోని ప్రముఖ పురదమ్మ ఆలయ పూజారి దయానంద్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం బాగల్‌గుంటే సమీపంలో నివసిస్తున్న బాధితురాలిని పూజారి లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడు దయానంద్ ను అరెస్టు చేశారు.హాసన్‌లోని పురదమ్మ దేవాలయం శక్తి దేవిగా భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. దయానంద్ చాలా ఏళ్లుగా పురదమ్మ ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్నారు.

A temple priest who raped a young woman believing that there was an error in the horoscope
శక్తిదేవి దేవత పేరు చెబుతున్న పూజారి దయానంద్ మంత్రాలు, వశీకరణం వంటి అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడి పేరుతో, హుండీ కానుక రూపంలో వచ్చిన డబ్బుతో దయానంద్ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. దయానంద్ అతని శరీరం మీద చాలా బంగారు నగలు ధరించి విలాసవంతమైన కార్లలో తిరిగేవాడు. తన రిచ్ లైఫ్ స్టైల్‌ను వీడియోలు చేసిన దయానంద్ అతని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

దయానంద్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి బాగా ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసు విచారణలో వెలుగు చూసింది. కొంతకాలంగా ఆ యువతి తాను అనుకున్న పనులు జరగడం లేదని తీవ్ర నిరాశకు గురౌతున్నదని పోలీసులు తెలిపారు.బాధితురాలు కూడా హాసన్ జిల్లా అరసికెరె తాలూకాకు చెందినది. బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆ యువతి ఉద్యోగం చేస్తున్నది.

బెంగళూరు నగరంలోని బాగలగుంటే సమీపంలోని ఒక పీజీలో ఆ యువతి నివాసం ఉంటోంది. పూజారి దయానంద్ పని చేస్తున్న ఆలయాన్ని సందర్శించిన సమయంలో పురదమ్మ భక్తురాలైన బాధితురాలికి పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం నేను గుడికి వెళ్ళినప్పుడు పూజారి దయానంద్ ఆ యువతి చెయ్యి చూసి మీ జాతకంలో దోషం ఉందని, ఈ దోషం తొలగిపోవాలంటే ప్రత్యేక పూజ చేయాలని, ఈ పూజలకు డబ్బులు ఖర్చవుతాయని పూజారి బాధితురాలితో చెప్పాడు.

A temple priest who raped a young woman believing that there was an error in the horoscope
శాంతి మేడమ్ చరిత్ర మొత్తం బయటకు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, దేవుడి ఆస్తులు

అందుకు అంగీకరించిన ఆ యువతి రూ. 10 వేలు పూజారి దయానంద్ కు ఇచ్చింది. ఆపై నిందితుడు దయానంద్ బాధితురాలికి కొన్ని నిమ్మకాయలు మంత్రించి ఇచ్చి ప్రతిరోజూ రాత్రి ఈ నిమ్మకాయలు తలదిండు కింద పెట్టి నిద్రపోవాలని మాయమాటలు చెప్పాడు. అనంతరం మే 24వ తేదీన బాధితురాలికి దయానంద్ ఫోన్ చేసి బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో పురదమ్మ దేవికి పూజలు చేస్తున్నామని, ఆ పూజలకు నువ్వు కూడా రావాలని ఆ యువతిని ఆహ్వానించాడు.

ఆ పూజకు వస్తే మంత్రించిన తాళి ఇస్తానని, తరువాత ని జాతకంలోని దోషాలపు పోతాయని నిందితుడు దయానంద్ ఆ యువతిని ప్రలోభపెట్టినట్లు సమాచారం.తరువాత పూజారి దయానంద్ బాగుల్ కుంటేలోని బాధితురాలి పీజీ వద్దకు వెళ్లి అతని కారులో ఆమెను ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. అయితే హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని ఇంటిలో జరుగుతున్న పూజకు తీసుకెళ్లకుండా మైసూరు రోడ్డుకు తీసుకెళ్లి మార్గం మధ్యంలో కారులోనే ఆ యువతిపై పూజారి దయానంద్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.

A temple priest who raped a young woman believing that there was an error in the horoscope

ఈ విషయం ఎవరికైనా చెబితే మార్ఫింగ్ చేసిన నీ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని పూజారి దయానంద్ ఆ యువతిని బెదిరించాడు. అనంతరం నిందితుడే దయానంద్ బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి రూ 40 వేలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆ యువతి పనిచేస్తున్న కంపెనీకి దగ్గరకు వెళ్లి ఆమెను పదేపదే బెదిరించారు. దయానంద్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆ వివరాలు పేర్కొన్నారు.

ఈ లైంగిక వేధింపులను తట్టుకోలేక బాధితురాలు ఎట్టకేలకు బాగల్‌గుంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూజారి దయానంద్ మొబైల్ స్వాధీనం చేసుకుని అతని ఫోన్ కాల్స్, యువతి ఫోన్ కాల్స్ సమాచారం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద జాతకంలో దోషం ఉందని యువతిప పూజారి అత్యాచారం చెయ్యడంతో హాసన్ లోని పురదమ్మ దేవాలయం భక్తులు షాక్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+