రాహుల్‌కు భారంగా కాంగ్రెస్‌ చెత్త ప్రదర్శన- అధ్యక్ష రేసుపై ప్రభావం-సీనియర్లకు మరో అస్త్రం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయాలు రాహుల్‌ గాందీ ఖాతాలో మరో ఓటమిని చేర్చాయి. ముఖ్యంగా కేరళ, బెంగాల్లో దారుణ ప్రదర్శనతో కాంగ్రెస్‌ పార్టీ మరింత పతనమైంది. అసోంలో సీట్లు పెంచుకున్నా అధికారం అందలేదు. పుదుచ్చేరిలో అధికారాన్ని కోల్పోయింది. తమిళనాడులో డీఎంకే అండతో కాస్తో కూస్తో ప్రభావం చూపింది. దీంతో గతేడాది పార్టీలో సీనియర్ల నుంచి తన నాయకత్వంపై సవాళ్లు ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ త్వరలో అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ఈ వైఫల్యాలు అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉంది.

కాంగ్రెస్‌ చెత్త ప్రదర్శన

కాంగ్రెస్‌ చెత్త ప్రదర్శన

తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటంటే ఒక్క చోటా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అస్సోంతో పాటు కేరళలోనూ పార్టీకి ఘోర పరాజయాలు తప్పలేదు. పుదుచ్చేరిలో అయితే అధికారాన్నే కోల్పోయింది. తమిళనాడులో డీఎంకే కలిసి సాధించిన 18 సీట్లు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్‌కు గుడ్డిలో మెల్ల ఊరటనిచ్చేలా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రశ్నార్దకంగా మార్చేశాయి.

రాహుల్‌ భవిష్యత్తుపై నీలి నీడలు

రాహుల్‌ భవిష్యత్తుపై నీలి నీడలు

వరుస పరాజయాలతో ఇప్పటికే దేశంలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు మారిపోయాయి. దీంతోపాటు రాహుల్‌ గాంధీ భవిష్యత్తుపైనా నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ఇప్పటికే యూపీలో వరుస పరాజయాలతో ఉత్తరాదిలో ప్రభావం కోల్పోతున్న రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోనూ పార్టీని గెలిపించలేకపోయారు. బెంగాల్లో ఆరంభ దశల్లో ప్రచారానికి దూరం కావడం ద్వారా రాహుల్‌ చారిత్రక తప్పిదం చేశారు. దీంతో ఇవన్నీ కలగలిపి ఆయన భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

 కాంగ్రెస్‌ అధ్యక్ష రేసుపైనా ప్రభావం

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసుపైనా ప్రభావం

ఇప్పటికే రాహుల్‌ గాంధీ నాయకత్వంపై ఇంటా బయటా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటముల పర్వం ఆయన్ను మరింత కుంగదీసే అవకాశముంది. అన్నింటికీ మించి ఆయన చేపట్టాల్సిన పార్టీ అధ్యక్ష రేసుపైనా ఈ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక పార్టీలో సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు తాజా ఫలితాలతో రాహుల్‌ గాంధీవైపు మొగ్గు చూపుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్ధితి.

కాసుకుని కూర్చున్న సీనియర్లు

కాసుకుని కూర్చున్న సీనియర్లు

నాయకత్వ ప్రతిభ చూపడంలో తరచూ విఫలమవుతున్న రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లు కొందరైతే, చెప్పకుండా సమయం కోసం ఎదురుచూస్తున్న వారు మరికొందరు. దీంతో తాజా పలితాల ప్రభావంతో సీనియర్లు మరింత రెచ్చిపోయే అవకాశాలూ లేకపోలేదు. సంస్దాగత ఎన్నికలకు డిమాండ్‌ చేయడం దగ్గరి నుంచి రాహుల్‌ కాకుండా మరో నేతకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే స్వరాలు పెరిగే అవకాశాలున్నాయి. వీటిని సోనియాగాంధీ ఎలా తట్టుకుంటారన్న దానిపైనే కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+