చిరుతపులిని చంపి తిన్న పులి; జాతి వైరం; ఫోటోలు వైరల్!!
చిరుత పులిని చంపి తిన్న పులి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. చిరుత పులిని చంపి పులి తింటుంది. ఇది అరుదైన ఘటన అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు అడవుల్లో జరుగుతాయి. కానీ ఒక నేషనల్ వెల్డ్ లైఫ్ పార్క్ లో ఒక ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హర్ష నరసింహమూర్తి తీసిన ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
బెంగళూరుకు చెందిన ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హర్ష నరసింహమూర్తి రాజస్థాన్లోని రణధంబోర్ నేషనల్ పార్క్ లో చిరుత పులిని పులి చంపి తినే అరుదైన ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించారు.

టీ101 గా గుర్తించిన ఒక పులి ఇటీవల నేషనల్ పార్క్ లోని జోన్ 1 లో చిరుత పులిని చంపి తింటూ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని బోధించే నరసింహమూర్తి తన సహ ఉద్యోగులతో కలిసి నేషనల్ పార్క్ లో ఉన్న సమయంలో, తెల్లవారుజామున పులి అడుగులను గుర్తించి నిదానంగా దానిని అనుసరించారు.
పులి అడుగులు ఒక ప్రవాహం దగ్గర ముగియడంతో అక్కడనుండి పులిని అన్వేషిస్తూ సాగిన తమ ప్రయాణం పులి చిరుత పులి తినడాన్ని చూసినట్టు పేర్కొన్నారు. ఇది అరుదుగా జరిగే సంఘటన అయినప్పటికీ దానిని కెమెరా లో బంధించడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. గతంలో ఒక మారు ఇటువంటి దృశ్యాన్ని దూరం నుండి చూసినప్పటికీ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయిన హర్ష నరసింహమూర్తి ఈసారి 40 50 అడుగుల దూరం నుండి ఆ చిత్రాలను కెమెరాలో క్యాప్చర్ చేయగలిగారు.
ఇక ఈ అరుదైన చిత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు .చిరుత పులిని తినే పులిని మీరు ఎప్పుడైనా చూసారా అంటూ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. అడవులలో జరిగే ఇటువంటి సంఘటనలు క్యాప్చర్ చేయడం చాలా అరుదు అని.. ఈ సంఘటనను ఎవరు ఊహించలేరు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక దీనిపై పర్యావరణ జీవ శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ గుబ్బి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అడవిలో తనతో పోటీని తొలగించుకోవాలని కోరుకునే పులులు చిరుత పులులను వేటాడుతాయని, పోటీ లేకుండా చేసుకోవడం కోసమే పులులు ఈ తరహా దాడులు చేస్తాయని పేర్కొన్నారు. ఇది చిరుతపులులకు, పులులకు మధ్య సహజంగా జరిగేదేనని ఆయన తెలిపారు. ఇక ఈ ఫోటోల ద్వారా పోటీ ఉన్నచోట వేట తప్పదని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications