పాకిస్థానీలకు డెడ్ లైన్ ఎండ్- వేట షురూ, అనూహ్య పరిణామాలు..!!
సరిహద్దుల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగ బడుతోంది. భారత్ సైన్యం ధీటుగా తిప్పి కొడుతోంది. అటు వైపు వాయు - నేవీలు ఎప్పడైనా .. దేనికైనా సిద్దమంటూ తమ యుద్ద సంసిద్దత వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా దౌత్య పరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేయటానికి మోదీ మంత్రాంగం వేగవంతం చేసారు. ఇక, భారత్ విడిచి వెళ్లి పోవాలంటూ విధించిన డెడ్ లైన్ ముగిసింది. ఇక వేట మొదలవుతోంది. ప్రభుత్వం - రక్షణ వ్యవస్థల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముగిసిన డెడ్ లైన్
పహల్గాం దాడి తరువాత భారత్ సీరియస్ గా స్పందించింది. పాక్ పై ఆంక్షలు విధించింది. భారత్ లో ఉన్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అదే విధంగా పాక్ తో చేసుకున్న ఒప్పందాల ను హోల్డ్ లో పెట్టింది. ఇక, భారత్ విధించిన ఆంక్షల కారణంగా గత నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్లిపోయారు. వారిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి భారత్ చేరుకున్నారు. ఉగ్రదాడి తర్వాత 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాకిస్థాన్ పౌరులంతా ఈ నెల 27లోగా భారత్‌ను వీడి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది.

పాక్ కు రిటర్న్
గత నాలుగు రోజుల్లో 537 మంది పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27న 237 మంది, 26న 81 మంది, 25న 191 మంది, 24న 28 మంది పాక్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లినట్లు అటారీ సరిహద్దు అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న 105 మంది, 25న 287 మంది, 26న 342, 27న 116 మంది భారతీయులు పాక్ నుంచి తిరిగి వచ్చేశారని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మనదేశంలోనే తిష్టవేసిన పాకిస్థానీయులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వారు ఇంకా కొనసాగితే.. 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్- 2025' ప్రకారం ఇండియాలో ఉండే పాక్ పౌరులను అరెస్టు చేయనున్నారు. ఈ చట్టం కింద అరెస్టైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలతో
దాడికి కారకులైన ఉగ్రవాదుల పైన కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ ఇప్పటికే హెచ్చరిక చేసారు. సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తం అయింది. ఉగ్రవాద శిబిరాల పై ప్రత్యేకంగా నిఘా పెట్టా రు. పెహల్గాం దాడి విచారణ బాధ్యతలు ఇప్పటికే కేంద్రం ఎన్ఐఏ కు అప్పగించింది. ఘటన జరి గిన ప్రాంతంలో ఆ సమయంలో ఉన్న ఆధారాలను సేకరించారు. పాకిస్థాన్ ప్రమేయం పైన ఆధా రాలను ప్రపంచ దేశాల ముందు బహిర్గతం చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. అటు పాక్ మంత్రులు లోలోపల ఆందోళన చెందుతూనే పైకి మాత్రం మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తు న్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ ఘటనకు ప్రతీకారంగా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications