Viral Video: ఆ క్షణం గుండె ఆగిపోయిందేమో.. చిరుత దాడి నుంచి త్రుటిలో..
జీవితంలో అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల్లో కొందరు త్రుటిలో తప్పించుకుంటారు. గండం గడిచిందని భావిస్తారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు.

సైకిల్
ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. అతను రోడ్డుపై వెళ్తుండగా సడన్ గా
ఓ చిరుత పులి పొదల్లోంచి అతని దాడి చేసేందుకు వచ్చింది. అదృష్టవశాత్తు అతను చిరుత దాడి నుంచి తప్పించుకున్నాడు. అతనిపై చిరుత దాడి చేస్తున్న దృశ్యాలను అతని వెనకాల కారు వెళ్తున్నవారు రికార్డు చేశారు.

డెహ్రడూన్, రుషికేశ్ రహదారి
చిరుత దాడి తర్వాత అతను భయంతో వెంటనే వెనక్కు వచ్చాడు. స్థానికుల వద్దకు వచ్చి తన గాయాలను చీసుకున్నాడు. ఈ ఘటన డెహ్రడూన్, రుషికేశ్ రహదారిపై జరిగింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు డెహ్రాడూన్-రిషికేశ్ హైవేపై జరిగింది..ఇద్దరూ అదృష్టవంతులే అని రాశారు.

38 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోను బుధవారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 38 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 17 వందలకు పైగా లైక్స్ రాగా 2 వందలకు పైగా మంది రీ ట్వీట్లు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లక్కీ మ్యాన్ అంటూ కామెంట్ చేశారు. వామ్మో ఈ వీడియో చూస్తే ఒళ్లు జల్లుమంటుందని మరొకరు కామెంట్ చేశారు.
On Dehradun-Rishikesh Highway....
— Susanta Nanda IFS (@susantananda3) September 21, 2022
Both are lucky ☺️☺️ pic.twitter.com/NNyE4ssP19












Click it and Unblock the Notifications