Viral Video: మగువా లోకాని తెలుసా నీ తెగువా.. వైరలైన వీడియో.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

నేటి సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు రాణిస్తున్నారు. దాదాపు ప్రతి పనిలో సత్తా చాటుతున్నారు. కుటుంబాన్ని నడపడం నుంచి అంతరిక్షానికి వెళ్లడం వరకు మహిళలు అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. తాజాగా ఓ మహిళకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ట్రక్కు నడుపుతూ మిగతా స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తోంది.

194,000 వ్యూస్

194,000 వ్యూస్

ఈ వీడియోలో ఓ మహిళ ట్రక్కు నడుపుతూ కనిపిస్తుంది. ఈ వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 194,000 వ్యూస్ వచ్చాయి. 11,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అయితే ఆమె ట్రక్కు నడుపుతూ ఇచ్చిన స్మైల్ ఆమె ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది. వీడియోలో మొదటగా లారీ మాత్రమే కనబడుతుంది. ఆ తర్వాత క్రమంగా ఆమె ఫ్రేమ్ లోకి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది లారీ నడిపేది మహిళ అని.

ఫిదా అయిన నెటిజన్లు

ఫిదా అయిన నెటిజన్లు


శరణ్ వీడియోతో పాటు డ్రైవర్ 'మగ' అయినా 'ఆడ' అయినా ట్రక్ డ్రైవర్‌కి అర్థం ఏమిటి? అని రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు మహిళను ప్రశంస్తున్నారు. "ఆమెను చూస్తే గర్వంగా ఉందని ఒకరు.. అద్భుతమైనదని మరొకరు, ఆ చిరునవ్వు అద్భుతమంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

ప్రజలను తట్టి లేపే వీడియోలు

IAS అవనీష్ శరణ్ తరచుగా ప్రజలను తట్టి లేపే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన
అతను తన 10వ తరగతి మార్క్ షీట్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అప్పట్లో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఓ వ్యక్తి 10 తరగతిలో కేవలం 314లో పాసయ్యాడు. అయినా అతను ఐఏఎస్ అయ్యాడు అంటూ పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+