Rahul Gandhi: ఆజాద్‌పూర్ మార్కెట్‍లో రాహుల్ గాంధీ.. వైరల్ అవుతోన్న వీడియో..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం కూరగాయల మార్కెట్ కు వెళ్లారు. ఆసియాలో అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌లలో ఒకటైన ఆజాద్‌పూర్ మండిని తెల్లవారుజామున 4 గంటలకు రాహుల్ సందర్శించారు. మార్కెట్‌లోని కూరగాయల అమ్మకందారులతో రాహుల్ మాట్లాడారు. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
जननायक राहुल गांधी जी आज दिल्ली की आजादपुर मंडी में सब्जी और फल विक्रेताओं से मिले।
— Congress (@INCIndia) August 1, 2023
राहुल जी ने उनकी समस्याओं को जाना और समझा।
भारत जोड़ो यात्रा जारी है... 🇮🇳 pic.twitter.com/g0PuMD3tEi
రాహుల్ గాంధీ గత శనివారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆజాద్‌పుర్ మార్కెట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా అంద మార్కెట్ కు వెళ్లారు. కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆజాద్‌పూర్ మండిని ఆయన సందర్శించారు. అనేక రకాల కూరగాయలు కిలో రూ.100కు పైగా విక్రయిస్తున్నారు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో టమోటాలు కూడా కిలో రూ.200కు పైగా పలుకుతున్నాయి.

రాహుల్ గాంధీ కేరళ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజుల తరువాత కూరగాయల మార్కెట్‌ను సందర్శించాడరు. కాగా కేరళలో రాహుల్ తన చిన్ననాటి మోకాలి గాయానికి చికిత్స తీసుకున్నాడు. రాహుల్ గాంధీ గత నెలలో హర్యానాలోని సోనేపట్‌లోని వ్యవసాయ పొలాలను సందర్శించారు. మహిళ రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత మహిళ రైతులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. రాహుల్ ఇంటికి వచ్చిన మహిళా రైతులు సోనియా గాంధీ ఆడిపాడారు.
మేలో రాహుల్ గాంధీ హర్యానాలోని ముర్తల్ నుంచి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించారు. రాహుల్ కర్ణాటకలోని బెంగళూరులో గిగ్ వర్కర్లను కలుసుకున్నారు. డెలివరీ భాగస్వామితో కలిసి స్కూటర్‌పై కూడా వెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని పీజీ మెన్స్ హాస్టల్‌ను కూడా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. UPSC ఆశావాదులతో కలవడానికి ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతానికి వెళ్లాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జామా మసీదు, బెంగాలీ మార్కెట్ ప్రాంతానికి కూడా ప్రయాణించాడు.












Click it and Unblock the Notifications