Viral Video: కేంద్ర ఆర్థిక మంత్రినే పట్టించుకోలేదు.. ఇది ప్రజాస్వామ్యమంటే..!
మనం బస్సుల్లోనో, మెట్రో రైళ్లలోనో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా సినీ సెలబ్రిటీ, రాజకీయ నాయకురాలు వస్తే ఏం చేస్తాం. వెంటనే నిలబడి నమస్తే సార్ లేదా మేడం అంటాం. అయితే ఎవరైనా మనం ఓటు వేస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. అలాగే మనం ఆదరిస్తేనే సెలబ్రిటీలు అవుతారు. కానీ అది మర్చిపోయి వారు రాగానే ఏదో కొంప మునిగిపోయినట్లుగా ఆగమాగం చేస్తాం. కానీ ఢిల్లీ ప్రజలు అలా చేయలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఆమెకు ఎవరు కూడా సీట్ ఇవ్వలేదు. ఆమెన ఒక సామాన్య పౌరురాలిగానే చూశారు. ఇలాంటి దృశ్యాలు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తాం. కానీ ఇది మన దగ్గర ఇలా జరిగిందంటే జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. కాగా నిర్మలా ఢిల్లీ మెట్రోలో లక్ష్మీ నగర్ వరకు నిలబడి ప్రయాణించారు. మిగతా ప్రయాణికులు ఆమెను పట్టించుకున్నట్లు కూడా కనిపించలేదు.

కానీ మహిళ మేడం బాయ్ అంటూ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ సిటిజన్ నిర్మలా సీతారామన్ కు సీటు ఇవ్వకపోవడం పలువు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెద్దావిడను గౌరవించి సీట్ ఇవ్వాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఆమె మంత్రి కారులో కూడా వెళ్లొచ్చు.. మెట్రోల పబ్లిసిటీ కోసం ఇలా ప్రయాణిస్తారని మరొకరు కామెంట్ చేశారు.
సీనియర్ సిటిజన్ అయిన భారత ఆర్థిక మంత్రికి కూడా సీటు ఇవ్వని ఢిల్లీ మెట్రో ప్రయాణికులు.. అసలు ఎటు పోతోంది భారతీయ సమాజం.. ఆనాటి విలువలు.. #delhimetro #nirmalasitaraman #financeMinister #metroJourney #chotanews pic.twitter.com/qD5CQDErzS
— ChotaNews (@ChotaNewsTelugu) May 18, 2024
మరికొందరు ఎవరినైనా సమానంగా చూడాలని.. మంత్రి అని సీటు ఇవ్వడం, సాధారణ వృద్ధురాలు అయితే సీటు ఇవ్వకపోవడం మంచిది కాదున్నారు. భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications