బెదిరింపులు, ఒత్తిడి: రేప్ బాధితురాలి ఆత్మహత్య

ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక గత రాత్రి పురుగుల మందు తాగి మరణించింది. కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడి కుటుంబ సభ్యులు బాలికపై, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నెల 9వ తేదీన ట్యూషన్ క్లాసుల నుంచి తిరిగి వస్తుండగా బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందినవాడు. బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో స్థానికులు నిందితుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
నిందితుడి కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి రాజీ చేసుకోవాలని అడిగారని, నిందితుడితో తమ అమ్మాయికి పెళ్లి చేస్తామని చెప్పారని, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తామని కూడా బెదిరించారని బాధితురాలి తల్లి అంటోంది. తమ కూతురు దక్కకుండా పోయిందని, నిందితుడిని ఉరి తీయాలని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications